Minister Harish Rao : టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది : మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది : మంత్రి హరీశ్ రావు
x
Highlights

Minister Harish Rao : నిరుపేదలకు ఆసరా ఫించన్లు, బీడీలు చుట్టే మహిళలకు బీడీ కార్మిక భృతి ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని మంత్రి హరీష్ రావు...

Minister Harish Rao : నిరుపేదలకు ఆసరా ఫించన్లు, బీడీలు చుట్టే మహిళలకు బీడీ కార్మిక భృతి ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఆయన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా 7 లక్షల మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద 5555 కోట్ల రూపాయలు అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీకి, సీఎం కేసీఆర్‌కే దక్కింది'అని హరీష్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో తెలంగాణ అభివృద్ధి శరవేగంగా సాగుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో తొలి కాన్పు తల్లి గారే చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రూ. 12 వేలు, కేసీఆర్ కిట్ ఉచితంగా ఇస్తోందని చెప్పారు.

నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేవారు, కానీ నేడు నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు అన్నట్టుగా తెలంగాణ సర్కారు పని చేస్తోంది. తెలంగాణ వచ్చాక ఎక్కడా తాగునీటి సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతామని వ్యాఖ్యానించారు. పంటలకు గిట్టుబాటు ధర అందించామని ఆయన ఈ సందర్భంగా గుర్త చేశారు. రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి కింద రైతుబంధు ఇస్తున్న ఒకే ఒక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు మాత్రమేనని అన్నారు. దేశంలోని 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్, 12 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నాయని, కానీ ఎక్కడా లేని విధంగా కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తోందని తెలిపారు. దుబ్బాక నియోజక వర్గంలో 57 వేల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. 'ఇతర పార్టీల నేతలు డబ్బాల్లో రాళ్లు వేసి ఉపేది ఊపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories