Harish Rao: విషాద ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదు

Harish Rao Comments On Congress Government
x

Harish Rao: విషాద ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదు

Highlights

Harish Rao: కుక్కకాట్లకు చిన్నారులు బలౌతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర

Harish Rao: రాష్ట్రంలో కుక్కకాట్లకు చిన్నారులు బలి అవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పసికందును కుక్కలు పీక్కుతిన్నాయన్న వార్త,, తన మనసును కలచివేసిందన్నారు. ఇంత హృదయవిదారక విషాద ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకపోవడం దుర్మార్గం అన్నారు హరీశ్‌రావు. రాష్ట్రంలో కుక్క కాట్లు పెరిగిపోతున్నాయని ముందు నుంచి హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఏడాది.. రాష్ట్రంలో 60 వేలకు పైగా కుక్క కాట్లు నమోదయ్యాయని, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని ట్వీట్ చేశారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ పడకేసిందని ధ్వజమెత్తారు. చెత్తాచెదారం పేరుకుపోయి వీధికుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు హరీశ్‌రావు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉంటే అందులో 10 లక్షలకు పైగా కుక్కలు జిహెచ్ఎంసి పరిధిలోనే ఉన్నాయంటే వీధి కుక్కల నియంత్రణలలో ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంద్నారు.

శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చెరబోతున్న 547 మంది SIలకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు హరీశ్‌రావు. ఎంతో శ్రమించి, ఎన్నో కష్టాలు దాటి గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగంలో చేరుతుండటం మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు నిజమైన పండుగ రోజు అన్నారు. విధి నిర్వహణలో నీతి, నిజాయతీగా వ్యవహరించాలని సూచించారు. శాంతి భద్రతలు కాపాడటంలో నిర్విరామ కృషి చేయాలన్నారు. 2022 ఏప్రిల్‌లో 17వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నాటి కేసీఆర్‌ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని హరీష్‌రావు గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories