Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నెన్స్ చేయడం రావట్లేదు

Harish Rao Comments On Congress Government
x

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నెన్స్ చేయడం రావట్లేదు

Highlights

Harish Rao: 2 నెలలుగా ఆసరా పింఛన్లు ఇవ్వలేదు

Harish Rao: కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గవర్నెన్స్ చేయడం రావడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. విద్యుత్ శాఖను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నారని ఆక్షేపించారు. కొత్త లబ్ధిదారులకు గృహజ్యోతి పథకం ఇవ్వడం లేదని విమర్శించారు. రెండు నెలలుగా ఆసరా పింఛన్లు ఇవ్వలేదన్నారు. వితంతు పింఛన్ కొత్తవి ఇవ్వడం లేదన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేవని... సొంత డబ్బులతో కొన్ని పనులను పంచాయతీ సెక్రటరీలు చేయించారన్నారు. ప్రస్తుతం వారి బదిలీలు జరుగుతున్నాయని... మరి ఖర్చు చేసిన నిధుల పరిస్థితేంటని ప్రశ్నించారు.

కొన్ని నెలలుగా తాము ప్రశ్నిస్తే మధ్యాహ్న భోజన, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడతో 750 కోట్ల రూపాయలను కేంద్రం ఆపిందన్నారు. ఉపాధి హామి ఫీల్డ్ అసిస్టెంట్లకు 2 నెలలుగా జీతాలు రాలేదని ఆరోపించారు. IAS, IPS అధికారుల విషయంలో బిహార్ బ్యాచ్ అంటూ రేవంత్ విమర్శలు చేశారని... మరి డీజీపీగా పంజాబ్ వ్యక్తిని ఎందుకు నియమించారని నిలదీశారు హరీశ్ రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories