TS News: బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ లో చేరిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, గజ్వేల్ నేత..

Hard Setback For BRS Party Madan Reddy Joined In Congress
x

TS News: బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ..కాంగ్రెస్‌లోకి మదన్‌రెడ్డి

Highlights

TS News: నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి పార్టీని వీడారు

TS News: మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమానంతరావు, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్,నర్సాపూర్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, గజ్వేల్ నియోజికవర్గ ఇంచార్జ్ నర్సారెడ్డి,డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నేతృత్వంలో ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి సమక్షంలో కాంగ్రెస్ లోకి మదన్ రెడ్డి, గజ్వేల్ నేత ఎలక్షన్ రెడ్డి .

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గులాబీ పార్టీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అత్యంత సన్నిహితుడైన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత చిలుముల మదన్ రెడ్డి ఆ పార్టీని వీడారు. సోమవారం భారీ అనుచర ఘనంతో కలిసి మదన్ రెడ్డి గాంధీభవన్ కు చేరుకున్నారు. గాంధీభవన్ వెలుపల నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి రోహిత్ చౌదరి కండువ కప్పి మదన్ రెడ్డిని, ఎలక్షన్ రెడ్డి లను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఈ ఎంపీ ఎన్నికల వేళ మెదక్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని విధంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఐదు పర్యాయాలు నర్సాపూర్ శాసనసభ్యులుగా ఎన్నికైన మదన్ రెడ్డికి మెదక్ జిల్లాలో పట్టున్న లీడర్గా పేరుంది. ఈ పార్లమెంటు ఎన్నికలవేళ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి బీ ఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇదిలాఉండగా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తరఫున నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి దాదాపు 2వేల మంది నాయకులు,కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories