KTR Birthday: కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసిన పవన్ కల్యాణ్, మహేశ్ బాబు
KTR Birthday: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు...
KTR Birthday: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు. కేటీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన నా సోదరుడు తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడు మీకు ఆరోగ్యాన్ని, అంతులేని సంతోషాలను ప్రసాదించాలి అని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఇందుకు స్పందించిన కేటీఆర్.. ధన్యవాదాలు అన్నా అని బదులిచ్చారు. మరోపక్క, జనసేన అధినేత పవన్ కల్యాణ్, 'పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ బ్రదర్ శ్రీ కేటీఆర్.. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని చిల్కూరు బాలాజీని ప్రార్థిస్తున్నాను' అని చెప్పారు.'హ్యాపీ బర్త్ డే కేటీఆర్.. అందరికీ స్ఫూర్తివంతమైన మీ నాయకత్వం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరెప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను' అని సినీనటుడు మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. వీరితో పాటు కేటీఆర్‌కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Many thanks Mahesh https://t.co/JjBZ6z6q5h
— KTR (@KTRTRS) July 24, 2020
Many thanks Anna 🙏 https://t.co/Zm5sXBYa8n
— KTR (@KTRTRS) July 24, 2020
My wholehearted Birthday wishes! to Our Dear Brother Shri @KTRTRS ; we all pray to 'Lord Chilkur Balaji' - to bless you with health, prosperity & well being on this special day. 🙏
— Pawan Kalyan (@PawanKalyan) July 24, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire