Half-Day Schools: రాష్ట్రంలో నేటి నుంచి ఒంటిపూట బడులు...ఎన్నిరోజులంటే?

School Holiday in Hyderabad
x

School Holiday in Hyderabad

Highlights

Half-Day Schools: విద్యార్థులకు గుడ్ న్యూస్. నేటి నుంచి ఒంటి పూట బడులు ఉంటాయి. కులగణనలో టీచర్లను వినియోగించుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Half Day For Primary Schools in Telangana : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు ఒంటిపూట మాత్రమే ఉంటాయి. వేసవి కాలంలో కదా ఒంటిపూట బడులు ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారా. అవును నిజమే కానీ ప్రైమరీ పాఠశాలలకు మాత్రమే. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి చేపట్టనున్న కులగణనకు ఉపాధ్యాయులను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మత్రమే ప్రాథమిక పాఠశాలలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కులగణనకు మొత్తం పాఠశాల విద్యాశాఖ నుంచి 50వల మంది వరకు సిబ్బందిని వినియోగించుకుంటారు.

ఇందులో 36వేల 559 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు, 3, 414 మంది ప్రైమరీ పాఠశాలల ప్రిన్సిపాల్లు, 6,256 మంది ఎంఆర్ సీలు, 2,000వేల మంది ప్రభుత్వ మినిస్టీరల్ స్టాఫ్ సహా పలు విభాగాలకు చెందినవారు కూడా ఉన్నారు. అయితే ఉపాధ్యాయుల కొరత ఉన్న ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బోధన పరంగా ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్టీటీలకు కులగణన నుంచి మినహాయింపు ఉంది.

సర్వే పూర్తి అయ్యేంత వరకు ఇది అమల్లోనే ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. సర్వేలో పాల్గొనున్న ఉపాధ్యాయులకు ప్లానింగ్ డిపార్ట్ మెంట్ వేతనాలు చెల్లిస్తుందని తెలిపింది.

కాగా కులగణన సర్వేను ఈనెల 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసింది. అయితే విద్యార్థులకు ఒంటిపూట బడి ఉన్నా..మధ్యాహ్న భోజనం మాత్రం షెడ్యూల్ ప్రకారం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories