TGPSC Group2 Exam Today: నేటి నుంచి తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు..అభ్యర్థులు ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే

TGPSC Group2 Exam Today:  నేటి నుంచి తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు..అభ్యర్థులు ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే
x
Highlights

TGPSC Group2 Exam Today: ఇవాళ్టి నుంచి తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఇవాళ, రేపు నిర్వహించే ఈ పరీక్షలకు ఏర్పాట్లను పూర్తి చేసింది తెలంగాణ...

TGPSC Group2 Exam Today: ఇవాళ్టి నుంచి తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఇవాళ, రేపు నిర్వహించే ఈ పరీక్షలకు ఏర్పాట్లను పూర్తి చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓఎంఆర్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహణ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలను టీజీపీఎస్సీ ఇప్పటికే రెడీ చేసింది. పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షకు 5,55943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి గతంలో పలు మార్లు ఏర్పాట్లు చేసినప్పటికీ పలు సాంకేతిక కారణాలతో వాయిదాపడ్డాయి.

గ్రూప్ 2 పరీక్షలో ఒక్కో పేపర్ కు 150 మార్కుల చొప్పున మొత్తం 4 పేపర్లకు 600 మార్కులకు ఈ పరీక్షజరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్నాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసివేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే తెలిపింది.

అభ్యర్థలకు సూచనలు ఇవే

- హాల్ టికెట్ తప్పనిసరిగా ఉండాలి.

-ప్రభుత్వం జారీ చేసిన ఫొటో ఐడీ కార్డును అభ్యర్థులు వెంట తీసుకెళ్లాలి.

-మంగళసూత్రం, గాజులు వేసుకోకూడదు

-అభ్యర్థులు చెప్పులు వేసుకుని రావచ్చు.

-పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ బయోమెట్రిక్ తప్పనిసరిగా ఉండాలి.

-బయోమెట్రిక్ వేయకపోతే ఓఎంఆర్ పత్రాలను మూల్యాంకనం చేయబోమని టీజీపీఎస్సీ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories