KTR: గ్రీన్ కో సంస్థ‌కు కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు

Greenko Groups Delivers 200 Units of Large Medical Oxygen Concentrators in Hyderabad | KTR
x

KTR FIle Photo

Highlights

Oxygen Concentrator: చైనా నుంచి కార్గో విమానంలో తెలంగాణ‌ రాష్ట్రానికి 200 ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు అందాయి.

Oxygen Concentrators: క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా ప్ర‌ళ‌యం సృష్టిస్తుంది. ప్రాణాంత‌క వైర‌స్ బారిన ప‌డే వారి సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆక్సీజ‌న్ అంద‌క ప‌లువురు క‌రోనా రోగులు మృతి చెందారు. తెలంగాణ‌లో ప‌రిస్థితి మెరుగ్గా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ క‌రోనా కేసులు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఆక్సీజ‌న్ కొర‌త లేకుండా ప్ర‌భుత్వాలు తీవ్రంగా ప్ర‌త్నిస్తున్నాయి. ఇత‌ర రాష్ట్రాల క‌రోనా రోగుల కూడా తెలంగాణలో చికిత్స పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ స‌ర్కార్.. ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించిన విష‌యం తెలిసిందే.

చైనా నుంచి కార్గో విమానంలో తెలంగాణ‌ రాష్ట్రానికి 200 ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు అందాయి. వాటిని దిగుమ‌తి చేసిన గ్రీన్ కో సంస్థ ప్ర‌తినిధులు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కి అందించారు. దీంతో గ్రీన్ కో సంస్థ‌కు కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ... క‌రోనా క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.

ఈ విష‌యంలో తెలంగాణ‌లో నిధుల కొర‌త లేదని కేటీఆర్ తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల క‌రోనా రోగుల‌కు కూడా తెలంగాణ‌లో చికిత్స అందుతోంద‌ని ఆయ‌న చెప్పారు. ఔష‌ధాలు, ఆక్సిజ‌న్, ఇత‌ర వైద్య ప‌రికరాలు అందించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరామ‌ని ఆయ‌న తెలిపారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories