MLC Elections 2021: రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌

Graduate MLC Elections Polling today In Telangana
x

Representational Image

Highlights

MLC Elections 2021: ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు * రెండు స్థానాల్లో మొత్తం 10,36,833 మంది ఓటర్లు

MLC Elections 2021: పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు వేళయింది. జంబో బ్యాలెట్‌ పత్రాలు, భారీ బ్యాలెట్‌ బాక్సులు పోలింగ్‌ కేంద్రాలకు చేరాయి. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌; హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాలకు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలను శానిటైజ్‌ చేయించిన అధికారులు.. ప్రత్యేకంగా వైద్యారోగ్య శాఖ సిబ్బందిని నియమించారు. శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచారు. ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరి ఉష్ణోగ్రతను థర్మల్‌ స్కానర్‌ ద్వారా పరిశీలించనున్నారు.

రెండు నియోజకవర్గాల పరిధిలో 10 లక్షలకుపైగా ఓటర్లున్నారు. 1,530 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక, కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేశారు. మరి కొన్నిచోట్ల సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను పోలీసులు గుర్తించారు.

కట్టుదిట్ట భద్రతకు చర్యలు తీసుకున్నారు. ఒక్కొక్కరికీ ఓటు వేయడానికే మూడు నుంచి ఐదు నిమిషాలు పట్టే అవకాశం ఉంది. ఇందుకు కారణం.. రెండు నియోజక వర్గాల్లోనూ అభ్యర్థులు రికార్డు సంఖ్యలో నిలబడడం ఒకటైతే.. జంబో బ్యాలెట్‌ను ముద్రించడం మరొకటి. దీనికితోడు, ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి. పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రాధాన్య క్రమంలో ఎన్నుకోవాలి.పోలింగ్‌ సమయం ఎనిమిది గంటలు మాత్రమే. అందుకే, 4 గంటల్లోపు పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చిన అందరినీ అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories