తెలంగాణలో సమీపిస్తున్న పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికలు

Telangana graduate assembly elections
x

ప్రతీకాత్మక చిత్రం 

Highlights

గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న అభ్యర్ధులు - హైదరబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో టీఆర్ఎస్ బీజేపీ మధ్యే పోటీ - వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానంపైనే అందరి దృష్టి - గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న ఇండిపెండెంట్లు

తెలంగాణలో పట్టభద్రుల ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు గేలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి.. ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియలో చురుకుగా పాల్గొన్న పార్టీలు ప్రచారం పైనే దృష్టి సారించాయి.. ఐతే, ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద పార్టీలకు ధీటుగా చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ లు మేము సైతం అంటు సవాలు విసురుతున్నాయి.

పట్టభద్రుల ఎన్నికలకు హైదరబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి పెద్దగా పోటీ లేదు. ఇక్కడ అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొనడంతో అందరి దృష్టి వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానంపైనే పడింది. ఇక్కడ అన్ని పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షలు ప్రోఫెసర్ కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ రెడ్డి, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ రాణి రుద్రమ, వామపక్షాల నుండి విజయసారధి, తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు బరిలో ఉన్నారు. ఇప్పటికే బీజేపీ నుండి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉండగా ఇంకా టీఆర్ఎస్, కాంగ్రెస్ లు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రోఫెసర్ కోదండరాం ఇప్పటికే మూడు జిల్లాల్లో పర్యటిస్తు నిరుద్యోగులను మేధావులను. ఉద్యోగలను కలుస్తు ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. ఉద్యమంలో జేఏసీ చైర్మన్ గా ప్రజలందరికి సుపరిచితమైన పేరే అయినప్పటికి కొంత మెతక వైఖరి ఉండడం బలమైన క్యాడర్ లేకపోవడం కోదండరాంకి కొంత ప్రతికూల అంశంగా చెప్పవచ్చు. ఇంటి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్ రెడ్డి వరంగల్ కేంద్రంగా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు స్థానికంగా మంచి పేరు ఉండడంతో కలిసి వచ్చే అంశమే కాని ప్రచారంలో దూకుడు లేకపోవడం పెద్దగా క్యాడర్ లేకపోవడం ప్రతికూల అంశం.

యువ తెలంగాణ పార్టీలో ఉన్న రాణి రుద్రమ సుధీర్ఘకాలం జర్నలిస్టుగా ఉండడం ఉద్యమ సమయంలో బలంగా ప్రజల్లోకి వెళ్లడం కొంత అనుకూలంగా ఉన్నప్పటికి ఓటర్లను ప్రభావితం చేసేంత వ్యూహం లేకపోవడం ప్రతికూలంశం గా చెప్పవచ్చు. పార్టీ ఏదైన విమర్శలు, దూకుడు నైజం.. ప్రశ్నించడం కోసమే అంటు వస్తున్న తీన్మార్ మల్లన్న ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉద్యోగ నోటిపికేషన్లని, ప్రభుత్వ వ్యతిరేకతను ముందుకు తీసుకెళ్తు ఒటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక జర్నలిస్టుగా సుదీర్ఘ సేవలందించి వామపక్షాల అభ్యర్థిగా వచ్చిన విజయసారధి.. అభ్యర్థి ప్రకటన తర్వాత అసలు కనిపించనే లేదు. వామపక్షాలకు నల్గొండ, ఖమ్మం లో మంచి పట్టు ఉండడంతో వారసత్వ ఓటు బ్యాంకు పైనే దృష్టి సాదించారు.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేల అన్ని పార్టీలు నిరుద్యోగులు, ప్రైవేట్ టీచర్ల పైనే దృష్టి సారించాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఎటు వైపు మొగ్గు చూపుతారో తెలియని పరిస్థితి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories