పాత హాల్‌టికెట్లతోనే పది పరీక్షలు

పాత హాల్‌టికెట్లతోనే పది పరీక్షలు
x
Highlights

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి కాస్త అదుపులో ఉండడంతో పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కసరత్తు వేగం చేసింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్‌ఎస్‌సీ బోర్డు) డైరెక్టర్‌ ఏ సత్యనారాయణరెడ్డి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మార్చినెలలో ఏ హాల్ టికెట్లతో పరీక్షలు రాసారో ప్రస్తుతం అవే హాల్ టికెట్ నంబర్లతో పరీక్షలు నిర్వహించనున్నారని తెలిపారు.

పరీక్షా హాలులో కేవలం 20 మంది విద్యార్థులు ఉండేటట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇన్విజిలేటర్లు కూడా భౌతిక దూరం పాటించేవిధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకు గాను పరీక్షా కేంద్రాలను పెంచనున్నామని, పాత కేంద్రాల సమీపంలోనే కొత్త కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories