తెలంగాణలో తన మార్క్‌ను చూపిస్తున్న గవర్నర్ తమిళిసై

Governor Tamilsai showing his mark in Telangana
x

తెలంగాణలో తన మార్క్‌ను చూపిస్తున్న గవర్నర్ తమిళిసై

Highlights

Tamilisai: *ప్రజా సమస్యలను విని పరిష్కరిచేందుకు సిద్ధమైన గవర్నర్

Tamilisai: మొన్నటి వరకు గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య నడిచిన వార్ ఇక ముందు కూడా కొనసాగనుంది. పరస్పర ఆరోపణల మధ్య ఇప్పటికే రాజ్ భవన్ కి ప్రగతి భవన్ కి గ్యాప్ పెరిగింది. సమయం వచ్చినప్పుడల్లా గవర్నర్.. తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి వెలుబుచ్చుతూనే ఉన్నారు. దీనిలో భాగంగా మరోసారి తన మార్క్ ను చూపించేందుకు రెడీ అవుతున్నారు గవర్నర్ తమిళిసై. గవర్నర్ అంటే రబ్బరు స్టాంప్ కాదు తాను కూడా ప్రజా సమస్యలను పరిష్కరించగలను అనే భరోసాను కల్పించనున్నారు. ఈ నెల 10న రాజ్ భవన్‌లో మహిళ దర్భార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

మొన్నటి వరకు గ్రీవెన్ సెల్ ద్వారా ప్రజా సమస్యలు విన్న తమిళి సై ఇక మీదట గవర్నర్ హోదాలో స్వయంగా ప్రజల నుండి ఆమె ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఈ నెల 10న ప్రజాదర్భార్‌లో భాగంగా మహిళా దర్బార్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. మధ్యాహ్నం 12:00 నుండి 1:00 గంటల వరకు దర్బార్ నిర్వహించనున్నారు. గతంలో ఏ గవర్నర్ చేయని విధంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ప్రజా సమస్యలకు వేదికగా చూపించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రెండవ తొలి మహిళ గవర్నర్ గా 2019 సెప్టెంబర్ 8న తమిళిసై బాధ్యతలు చేపట్టారు. ఇక పుదుచ్చేరి అదనపు గవర్నర్‌గా 2021 ఫిబ్రవరి 18న బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్‌గా ఆమె బాద్యతలు తీసుకున్న మొదట్లో చాలా యాక్టీవ్‌గా పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తనదైన రీతిలో విమర్శలు చేశారు. ఇక కరోనా తీవ్రతను ప్రభుత్వం చాలా తక్కువగా అంచనా వేసిందని నేరుగా సీఎంను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. వైద్య నిపుణురాలిగా ఉన్న అనుభవంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. వైరస్‌ వ్యాప్తి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే కట్టడి కోసం ప్రభుత్వానికి ఆరు, ఏడు లేఖలు రాశారు.

ఇక టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను ప్రతిపక్ష పార్టీల నేతలు ఎప్పటికప్పుడు ఆమె దృష్టికి తీసుకెళ్తున్నారు. బీజేపీ చీఫ్ సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ గవర్నర్ స్వయంగా మహిళా దర్భార్ నిర్వహిస్తే ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు సంభవిస్తాయి మహిళా దర్భార్ నిర్వహిస్తే అధికార పార్టీకి ఏమైనా చిక్కులు ఎదురు అవుతాయా అన్న చర్చ జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories