Governor Tamilisai Soundararajan review on Corona Situation: వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలంగాణ గవర్నర్ పిలుపు..

Governor Tamilisai Soundararajan  review on Corona Situation: వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలంగాణ గవర్నర్ పిలుపు..
x
Highlights

Governor Tamilisai Soundararajan review on Corona Situation: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య దావానంలా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. గత పది రోజులుగా ప్రతి రోజు వెయ్యికి తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి.

Governor Tamilisai Soundararajan review on Corona Situation : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య దావానంలా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. గత పది రోజులుగా ప్రతి రోజు వెయ్యికి తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నర్ తమిళిసై కరోనా వ్యాప్తిని నివారించేందుకు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను రాజ్ భవన్‌కు రావాల్సిందిగా ఆదేశించారు. ఈ సమావేశంలో గవర్నర్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో, ఆ చర్యల గురించి తెలుసుకోవడంతో పాటు పలు సూచనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 1590 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,902కు చేరుకున్నాయి.ఇక ఈ రోజు 1,166 మంది డిశ్చార్జ్ కాగా, కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 7 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 295కు చేరింది. ఆదివారం నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 1277 కేసులు వచ్చాయి. ఇక మిగిలిన కేసులు రంగారెడ్డి జిల్లాలో 82, మేడ్చల్ జిల్లాలో 125, కరీంనగర్ జిల్లాలో 04, సంగారెడ్డిలో 04, మహబూబ్ నగర్ లో 19, నల్గొండ జిల్లాలో 14, సూర్యాపేటలో 23, వనపర్తిలో ౦4, నిజామాబాద్ , మెదక్ లో 03, నిర్మల్ , వికారాబాద్ ,భద్రాది కొత్తేగుడం, జనగాంలలో రెండేసి కేసులు, ఇక సిద్దిపేట, గద్వాల్, సిరిసిల్లా , వరంగల్ రూరల్ , పెద్దపల్లి, యదాద్రి, కామారెడ్డి, ఆదిలాబాద్ లో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.

ఇక కొత్తగా 1,166 మంది కోలుకోవడంతో ఇప్పటివరకూ మొత్తం 12,703 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 10,904 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఆదివారం కొత్తగా 5,290 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,15,835 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇదిలావుంటే శుక్ర , శని, ఆది వారాల్లో కరోనా నుంచి కోలుకొని పెద్ద సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవ్వడం సంతోషాన్ని కలిగిస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories