Governor Tamilisai: నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారేమో.. గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు..
Governor Tamilisai Soundararajan: ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ప్రశ్నల వర్షం కురిపించారు.
Governor Tamilisai Soundararajan: ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో కీలక బిల్లులను రాజ్ భవన్ తొక్కి పడుతుందన్న ప్రచారాన్ని తప్పుబట్టిన ఆమె.. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుపై క్లారిఫికేషన్ కావాలని కోరామని తెలిపారు. 8 ఏళ్లుగా చాలా వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీ ఉన్నాయన్న ఆమె తనవల్ల నియామకాలు ఆగిపోయినట్టు బోగస్ ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బోర్డు ఏర్పాటయ్యాక న్యాయపరమైన సమస్యలు వస్తే ఎవరు బాధ్యులన్న ఆమె అందుకే ఈ బిల్లు విషయంలో క్లారిటీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అంతేకాదు రాష్ర్టంలో అప్రజాస్వామిక పరిస్థితులున్నాయన్న తమిళిసై మోయినాబాద్ కేసునూ ఆపాదించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. తన ఫోన్ ట్యాప్ అవుతుందన్న అనుమానం వ్యక్తం చేశారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire