Bhadrachalam: భద్రాద్రి రాములోరి సేవలో తెలంగాణ గవర్నర్‌

Governor Jishnu Dev Varma Visits Bhadrachalam
x

Bhadrachalam: భద్రాద్రి రాములోరి సేవలో తెలంగాణ గవర్నర్‌

Highlights

Bhadrachalam: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ.

Bhadrachalam: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు ఆలయ అర్చకులు, ఈవో రమాదేవి. అనంతరం గర్భగుడిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాసేపట్లో భద్రాచలం నుంచి రోడ్డుమార్గంలో కొత్తగూడెంకు బయల్దేరి వెళ్లనున్నారు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ. అనంతరం కలెక్టర్‌ ఆఫీస్‌లో అధికారులతో ఆయన భేటీ కానున్నారు. ఆ తర్వాత కళకారులు, రచయితలతో సమావేశమయి చర్చించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఖమ్మంలోని NSP గెస్ట్‌హౌస్‌కు చేరుకోనున్నారు. అనంతరం ఖమ్మం కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు గవర్నర్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories