Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల జాతర..నిన్న 4వేల ఉద్యోగాలకు లైన్ క్లియర్..నేడు మరో నోటిఫికేషన్ రిలీజ్

Government is getting ready for another job notification in Telangana
x

 Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల జాతర..నిన్న 4వేల ఉద్యోగాలకు లైన్ క్లియర్..నేడు మరో నోటిఫికేషన్ రిలీజ్

Highlights

Telangana Jobs:తెలంగాణలో ఉద్యోగాల జాతర షురూ కానుంది. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సర్కార్..వాటికి అనుగుణంగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది.

Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల జాతర సందడి నెలకొంది. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..వాటికి అనుగుణంగానే నోటిఫికేషన్స్ రిలీజ్ చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ నెలలోపే 4వేలకు పైగా వైద్యారోగ్య శాఖలో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

ఇప్పటికే 35వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం..ఈ ఏడాది చివరి నాటికి మరో 35వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఈమధ్యే సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుందని..గత ప్రభుత్వం వలే కాకుండా..న్యాయ సమస్యల లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేసింది.

ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేస్తూనే...మరోవైపు ప్రైవేట్ రంగంలోకూడా ఉద్యోగాలను కల్పిస్తోంది ప్రభుత్వం. జిల్లాల వారీగా ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, కాలేజీల్లో ఖాళీ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా మరో ఉద్యోగ ప్రకటన వెలువడింది. టీజీఎస్ఆర్టీసీ తార్నాక నర్సింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పలు ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్టు చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.

ఈ పోస్టుల భర్తీకి ఈనెల 18న ఇంటర్వ్యూ జరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి ఈ ఇంటర్వ్యూలు ఉంటాయి. అర్హత గల ఉద్యోగార్థులు పూర్తి వివరాలకు 70750 09463, 88850 27780 సంప్రదించవచ్చని అని సజ్జనార్ పేర్కొన్నారు.

ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నర్సింగ్ లో ఎమ్మెస్సీ పూర్త చేయాలి. దీంతోపాటు సంబంధిత పనిలో 12ఏండ్ల అనుభవం ఉండాలి. ఈ పోస్టులకు నర్సింగ్ పీహెచ్‌డీ పూర్తి చేసినవారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. నెలకు రూ. 50వేల జీతం ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారు కూడా ఎమ్మెస్సీ నర్సింగ్ చేయడంతోపాటు 3ఏండ్ల పనిచేసిన అనుభవం ఉండాలని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories