ఫలించిన బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఆందోళన

Government Accepted The Demands Of The Students
x

ఫలించిన బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఆందోళన

Highlights

Basara IIIT: విద్యార్థుల డిమాండ్లను అంగీకరించిన ప్రభుత్వం

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల పోరాటం ఫలించింది. వారం రోజులుగా చేపట్టిన ఆందోళనకు పులిస్టాప్ పడింది. రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జరిపిన చర్చలు సఫలీకృతం అయ్యాయి. విద్యార్ధుల 12 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. విద్యార్ధులు తమ ఆందోళ విరమించి తరగతులకు హాజరు కానున్నట్లు ప్రకటించారు. స్వయాన విద్యాశాఖ మంత్రి తమ సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిస్తున్నట్లు యూనివర్సిటీ విద్యార్ధులు తెలిపారు.

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు వారం రోజులుగా ఆందోళన చేపట్టారు. 12 డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రకరకాల నిరసనలు చేపట్టారు. ఎట్టకేలకు ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. మంత్రి సబితా ఇంద్రరెడ్డి విద్యాశాఖాధికారులతో పాటు, జిల్లా కలెక్టర్. ఇతర ముఖ్య అధికారులతో ఆదిలాబాద్ ట్రిపుల్ ఐటీని సందర్శించారు. అర్ధరాత్రి వరకు విద్యార్ధులతో చర్చలు జరిపారు. విద్యార్ధులను నేరుగా సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి సబిత.. డిమాండ్ల పరిష్కారానికి సముఖత వ్యక్తం చేశారు. విద్యార్ధుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు. నెల రోజుల వ్యవధిలో హామీ నెరవేరుస్తామని చెప్పారు. మరోసారి ట్రిపుల్ ఐటీనీ సందర్శిస్తానని మంత్రి సబిత చెప్పారు.

కొత్త వీసీని నియమించాలని.. తమ న్యాయమైన హామీలు నెరవేర్చాలంటూ బాసరా ఐఐటీలోని వేలాది మంది విద్యార్ధులు రోడ్డెక్కడంతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం రాత్రి నేరుగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు చేరుకుని విద్యార్ధులు, ఫ్యాకల్టీతో చర్చలు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన చర్చల్లో 50 మంది విద్యార్ధులు, అధ్యాపకులు పాల్గొన్నారు. దశలవారీగా డిమాండ్లను నెరవేర్చుతామని మంత్రి విద్యార్ధులకు హామీ ఇచ్చారు. ఇది ముమ్మాటికి తమ విజయమని.. తమపై ఎలాంటి ఒత్తడి లేదని విద్యార్ధులు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి తరగతులకు హజరవుతామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories