School Holiday: విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపు పాఠశాలలకు సెలవు

School Holidays
x

School Holidays

Highlights

School Holiday విద్యార్థులకు గుడ్ న్యూస్. గతవారం క్రిస్మస్ తోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో తెలంగాణలోని పాఠశాలలకు భారీగాసెలవులు వచ్చాయి....

School Holiday విద్యార్థులకు గుడ్ న్యూస్. గతవారం క్రిస్మస్ తోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో తెలంగాణలోని పాఠశాలలకు భారీగాసెలవులు వచ్చాయి. దీంతో విద్యార్థులు క్రిస్మస్ సంబురాల్లో మునిగిపోయారు. గత వారమంతా సరదాగడిపారు. ఇప్పుడు స్కూల్ అంటే పిల్లలకు కాస్త బాధగానే ఉంటుంది. ఇలా బాధపడుతున్న విద్యార్థులకు శుభవార్త. ఈరోజు ఒక్కరోజు స్కూల్ కు వెళ్లితే చాలు ..రేపు మళ్లీ సెలవు ఉంది.

2025 సంత్సరానికి స్వాగతం పలుకుతూ ఇవాళ, రేపు సంబురాలు జరుపుకుంటారు. ఇలా మనదేశంలో కూడా కొత్త సంవత్సరం సంబురాలు అంబరాన్ని అంటుతాయి. ఈ కొత్త సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ఇచ్చింది. జనవరి 1వ తేదీన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా గతవారమంతా సెలవులతో గడిపిన విద్యార్థులు ఈ వారం మధ్యలో మరో సెలవు రావడంతో ఖుషీ అవుతున్నారు.

కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు సాధారణంగానే శని, ఆదివారం రెండు రోజులు సెలవులు ఉంటాయి. అలాంటి పాఠశాలలకు ఈవారం కేవలం నాలుగు రోజులు మాత్రమే నడవనున్నాయి. ఇక సాధారణంగా ఆదివారం సెలవు ఉండే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈ వారం ఐదు రోజులు పనిచేయనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం న్యూఇయర్ సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించింది. జనవరి 1 ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు ఉంటుంది. ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories