School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్...వరుసగా 4 రోజులు సెలవులు.. పూర్తి వివరాలివే

School Holidays
x

 School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్...వరుసగా 4 రోజులు సెలవులు.. పూర్తి వివరాలివే

Highlights

School Holidays in Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. దీంతో ఉద్యోగులతోపాటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇది పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు.కొన్ని రాష్ట్రాల్లో నాలుగు రోజులు సెలువులు వస్తే..మరికొన్ని రాష్ట్రాల్లో ఐదురోజుల పాటు సెలవులు వస్తున్నాయి. పూర్తి వివరాలు చూద్దాం.

School Holidays: విద్యార్థులకు శుభవార్త. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పాఠశాలలకు మూడు రోజులు సెలువులు ఉంటే..మరికొన్ని పాఠశాలలకు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఈ నెల 17వ తేదీన సెలవు రోజుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు మిలాద్ ఉన్ నబీ, గణేష్ నిమజ్జనోత్సవం ఉంది.

సెప్టెంబర్ 14వ తేదీన రెండో శనివారం కావడంతో పాఠశాలలకు సెలవు ఉంది. 15వ తేదీ ఆదివారం ఆ రోజు సెలవు ఉంటుంది. 16వ తేదీ మిలాద్ ఉన్ నబీ ఆరోజు సెలవు. 17వ తేదీన వినాయకన నిమజ్జనోత్సవం ఉంది. ఆరోజు కూడా సెలువు ప్రకటించారు.ఇలా వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. అయితే 16న తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును రద్దు చేసింది. ఈనెల 14, 15వ తేదీల్లో సెలవులు అలాగే ఉన్నాయి.

16న మిలాద్ ఉన్ నబీ (మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు) పండుగ తేదీ మారడంతో.. నెలవంక దర్శనాన్ని బట్టీ.. ఈ పండుగను 16న కాకుండా.. 17న జరుపుకోనున్నారు. ఈనేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వం 16వ తేదీన సెలవును రద్దు చేసింది.. 17వ తేదీన ఇస్తున్నట్లు ప్రకటించింది. మరో విషయం ఏంటంటే నెలవంక 16న కపించినట్లయితే అదే రోజు సెలవు ఉండనుంది. అయితే ఇఫ్పటికే కొన్ని పాఠశాలలు మాత్రం 16వ తేదీన సెలవు ప్రకటించారు. ఇలా వరుసగా 4 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రానున్నాయి.

సెప్టెంబర్‌ నెల హాలిడేస్‌ జాబితా:

సెప్టెంబర్‌ 14 రెండో శనివారం

సెప్టెంబర్ 15 ఆదివారం సెలవు

సెప్టెంబర్ 16 మీలాద్ ఉన్ నబి పబ్లిక్ హాలుడే

సెప్టెంబర్ 17 వినాయక నిమజ్జనోత్సవం

సెప్టెంబర్ 22 ఆదివారం అందరికీ సెలవు

సెప్టెంబర్ 28 నాలుగో శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు

సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం అందరికీ సెలవు



Show Full Article
Print Article
Next Story
More Stories