TGSRTC: తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈ సర్వీసులన్నీ ఫ్రీ

TGSRTC: తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈ సర్వీసులన్నీ ఫ్రీ
x
Highlights

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు చేరువయ్యేందుకు,వారికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా...

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు చేరువయ్యేందుకు,వారికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తీసుకున్న నిర్ణయంపై ప్రయాణికుల నుంచి సంతోషం వ్యక్తం అవుతోంది. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులోలో టికెట్ బుక్ చేసుకుంటున్న చాలా మంది బస్సులు బయలుదేరే సమయానికి రావడం లేదు.

వారి కోసం డ్రైవర్ చాలా సమయం వరకు ఎదురుచూడాల్సి వస్తుంది. ఎందుకు రాలేకపోతున్నారనేది గమనిస్తే చాలా మంది చెబుతున్న విషయం ట్రాఫిక్ జామ్ అని. తాము ఉన్న ప్రాంతం నుంచి బస్టాండ్ కు రావడానికి సరైన ప్రయాణ ఏర్పాట్లు లేవని ఇలా రకరకాల కారణాలు చెబుతున్నారు. అందుకే ఆర్టీసీ ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి పికప్ వ్యాన్లను తీసుకువచ్చింది.

జంట నగరాల్లో ఈ పికప్ వ్యాన్లు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ప్రయాణికులు తాము ఎక్కడికి వెళ్లాలో చూసుకుని అక్కడికి వెళ్లే పికప్ వ్యాన్ ఎక్కాలి. అది ఆ బస్టాండ్ కు తీసుకువెళ్తుంది. అంటే ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్ వంటి డెస్టినేషన్లకు ఈ పికప్ వ్యానల్లోనే వెళ్లవచ్చు.

ఈసీఐఎల్ నుంచి ఎల్బీ నగర్ మధ్యలో ఉన్న ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, కందుకూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి రూట్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ పికప్ వ్యాన్లు ఉన్నాయి. శుక్రవారం నుంచి ఈ సర్వీసులు అందిస్తున్నాయి.

కాప్రా మున్సిపల్ కాంప్లెక్స్, మౌలాలీ హెచ్ బీ కాలనీ, హెచ్ఎంటీ నగర్, మల్లాపూర్, నాగోల్,ఎల్బీనగ్, ఎల్ పీటీ మార్కెట్ నుంచి పికప్ వ్యాన్లు ఉంటాయి. వీటిలో ఎక్కాలంటే ప్రయాణికులు తప్పనిసరిగా ముందుగానే దూర ప్రాంతాలకు వెళ్లే బస్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ పికప్ వ్యాన్లలో ఫ్రీగానే బస్టాండ్లకు వెళ్లవచ్చని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories