Money: 3లక్షల మంది రైతులకు గుడ్ న్యూస్..నవంబర్ 30న అకౌంట్లో డబ్బులు జమ..పూర్తి వివరాలివే

Money: 3లక్షల మంది రైతులకు గుడ్ న్యూస్..నవంబర్ 30న అకౌంట్లో డబ్బులు జమ..పూర్తి వివరాలివే
x
Highlights

Money: తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. పలు కారణాలతో రైతు రుణమాఫీ జరగని 3లక్షల మందికిపైగా రైతుల ఖాతాలో నవంబర్ 30న...

Money: తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. పలు కారణాలతో రైతు రుణమాఫీ జరగని 3లక్షల మందికిపైగా రైతుల ఖాతాలో నవంబర్ 30న డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పాలమూరులో జరగనున్న రైతు పండగ వేదికగా డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు.

తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. 3లక్షల మంది రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని తెలిపింది. పలు కారణాలతో రుణమాఫీ జరగని మూడు లక్షల మందికిపైగా రైతుల అకౌంట్లో ఈనెల 30వ తేదీన పాలమూరులో జరగనున్న రైతు పండగ కార్యక్రమం సందర్భంగా డబ్బులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన బుధవారం జరిగిన వ్యవసాయ మార్కెట్ మిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రితుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి పాటుపడుతున్నారని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయానికి రూ. 47వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అందులో నుంచి రుణమాఫీకి 18వేల కోట్లు, రైతు బంధుకు రూ. 7,600కోట్లు వెచ్చించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తెల్ల రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్, బ్యాంకు అకౌంట్లో పేర్లు, నెంబర్లు తప్పుగా ఉండటం వంటి కారణాలతో 3లక్షల మందికి రుణమాఫీ జరగలేదన్న విషక్ష్న్ని తెలిపారు. వ్యవసాయ శాఖాధికారులు గత మూడు నెలలుగా ఇలాంటి రైతుల వివరాలు సేకరించి, తప్పులను సరిచేసినట్లు చెప్పారు. ఈనెల 30వ తేదీన వారందరికీ రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి రైతు భీమా ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

పాలమూరు, రంగారెడ్డి జిల్లాల రైతుల కోసం హైదరాబాద్ -షాద్ నగర్ మధ్య రూ. 2వేల కోట్లతో అతిపెద్ద మార్కెట్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ విడత రైతులు 1.53 కోట్ల టన్నుల దిగుబడి సాధించారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories