పెద్దపల్లి జిల్లాలో వీడిన గోల్డ్ మిస్సింగ్ మిస్టరీ.. సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఏమాత్రం..

పెద్దపల్లి జిల్లాలో వీడిన గోల్డ్ మిస్సింగ్ మిస్టరీ.. సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఏమాత్రం..
x

పెద్దపల్లి జిల్లాలో వీడిన గోల్డ్ మిస్సింగ్ మిస్టరీ

Highlights

ప్రమాదం జరిగిందన్న సమాచారంతో రెండు 108 వాహనాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రమాదంలో కారు పూర్తిగా ద్వంసం అయింది. ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అని...

ప్రమాదం జరిగిందన్న సమాచారంతో రెండు 108 వాహనాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రమాదంలో కారు పూర్తిగా ద్వంసం అయింది. ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అని వెదికిన 108 సిబ్బందికి కళ్లముందు భారీగా బంగారం కనిపించింది. అయితే నిజాయితీగా బంగారాన్ని పోలీసులకు అప్పగించారు 108 సిబ్బంది. దీంతో పోలీసులు వాళ్లపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే కొన్నిగంటల్లోనే సీన్ మారిపోయింది ప్రమాదంలో 2.3 కిలోల బంగారం మిస్ అయిందని గోల్డ్ వ్యాపారుల కుటుంబీకులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అంతే క్షణం ఆలస్యం చేయకుండా టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఏమాత్రం తీసిపోని ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలో జరిగింది.

పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో నిన్న రోడ్డుప్రమాదం జరిగింది. తెల్లవారుజామున మాల్యాలపల్లిలో రాజీవ్ రహదారి మూలమలుపు దగ్గర కారు బోల్తా పడిన ఘటనలో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన గోల్డ్ వ్యాపారులు రాంబాబు, శ్రీనివాసం మరణించారు. ప్రమాద సమయంలో కారులో బంగారాన్ని గుర్తించిన 108 సిబ్బంది పోలీసులకు 3.3 కిలోల అప్పగించారు. అయితే మరో 2.3 కిలోల గోల్డ్ మిస్సయిందని బంగారు వ్యాపారుల కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రామగుండం టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది.

మిస్ అయిన బంగారం కోసం రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌కు 108 డ్రైవర్ లక్ష్మారెడ్డి, తాజుద్దీన్‌ల మీద అనుమానం కలిగింది. 3.3 కిలోల బంగారం తిరిగి ఇచ్చేయడం మామూలు విషయం కాదనుకున్నారో ఏమో ఒక్కసారి తమదైన శైలిలో విచారణ చేసి చూద్దాం అనుకున్నారు. అయితే లక్ష్మారెడ్డి, తాజుద్దీన్‌లో పోలీసులను పెద్దగా శ్రమపెట్టకుండానే నిజం ఒప్పుకున్నారు. భారీ ఎత్తున బంగారం చూసేసరికి టెంప్ట్ అయ్యామన్నారు. బంగారు కవర్ల నుంచి చెరో కవర్ జేబులో పెట్టుకున్నామని ఒప్పేసుకన్నారు. ఈ మొత్తం ఘటనపై క్లారిటీ ఇచ్చిన సీపీ 108 సిబ్బంది అత్యాశ వారికి చెడ్డపేరు తీసుకొచ్చేలా చేసిందన్నారు. అత్యవసర సేవలు అందించే సిబ్బంది ఇలాంటి పనులు చేయకూడదని హితవు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories