TS News Today: ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఫీజుల ధరలను ఖరారు చేసిన సర్కార్‌

GO NO 40 Issued by the Health Department on Corona Treatment Charges in Telangana State
x

తెలంగాణ గవర్నమెంట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

కరోనా చికిత్స ఛార్జీలపై జీవో 40 జారీ చేసిన ఆరోగ్యశాఖ సాధారణవార్డులో ఐసోలేషన్‌, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ.4వేలు

TS News Today: తెలంగాణలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఫీజుల ధరలను ఖరారు చేసింది టీఎస్‌ వైద్యారోగ్యశాఖ. కరోనా చికిత్స ఛార్జీలపై జీవో నెంబర్‌ 40ని జారీ చేసింది. సాధారణవార్డులో ఐసోలేషన్‌, పరీక్షలకు రోజుకు గరిష్టంగా 4వేలు, ఐసీయూ గదిలో రోజుకు గరిష్టంగా 7వేల 500గా నిర్ణయించింది. ఇక.. వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి అయితే.. రోజుకు గరిష్టంగా 9వేలుగా ప్రకటించింది. పీపీఈ కిట్‌ ధర 273 రూపాయలకు మించరాదని, హెచ్ఆర్‌సీటీకి 19వందల 95, డిజిటల్‌ ఎక్స్‌రే కు 13వందలు, ఐఆర్‌ కు 13వందలుగా నిర్ణయించింది. అలాగే.. అంబులెన్స్‌లకు కిలోమీటర్‌కు 75 రూపాయలు, వసతులతో కూడిన అంబులెన్స్‌ అయితే.. కిలోమీటర్‌కు 125 రూపాయల చొప్పున వసూలు చేయాలని సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories