Hyderabad: నగరంలో ఆధునిక టాయిలెట్లు

Hyderabad: నగరంలో ఆధునిక టాయిలెట్లు
x
Highlights

నగరంలో పర్యావరణాన్ని కాపాడాటనానికి జీహెచ్ఎంసీ అధికారులు పలు కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్బంగా నగరంలో అత్యాధునిక నమూనాలతో టాయిలెట్లు నిర్మించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.

నగరంలో పర్యావరణాన్ని కాపాడాటనానికి జీహెచ్ఎంసీ అధికారులు పలు కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్బంగా నగరంలో అత్యాధునిక నమూనాలతో టాయిలెట్లు నిర్మించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఈనేపథ్యంలోనే పదిరకాల కొత్త నమూనాల టాయిలెట్ల నమూనాలను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో పురపాలకశాఖ మంత్రి కే.టీ. రామారావు మాట్లాడుతూ నగరంలో జోన్‌కు 500 చొప్పున 3000 టాయిలెట్లు నిర్మించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు లక్ష్యాన్ని నిర్ధారించారని ఆయన తెలిపారు. దీంతో పర్యావరణాన్ని కాపాడడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు, మహిళలు, వికలాంగులు, పిల్లలకు అనువుగా ఉండే నమూనాలు టాయిలెట్లు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. పోర్టబుల్‌ టాయిలెట్స్‌, బస్టాప్‌, రైల్వేస్టేషన్‌, పేవ్‌మెంట్‌, హై-వే, అర్బన్‌, అంగన్‌వాడీ, కమ్యూనిటీ, పార్కు నమూనాలు ఇందులో ఉన్నాయన్నారు. ఈ నమూనాలను పరిశీలించి వాటి నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం వీటి నిర్మాణానికి అనువైన స్థలాల ఎంపిక పూర్తిచేసే ప్రయత్నంలో అధికారులు ఉన్నారన్నారు. దాంతో పాటుగానే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా నిర్మించే టాయిలెట్ల నమూనాలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్‌ అధికారుల భాగస్వాముల కావాలని ఆయన కోరారు.

ఈ నేపథ్యంలోనే ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్‌ కల్పిత్‌ ఆశర్‌ వీటిని రూపొందించారు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్‌, ఉదయ్‌పూర్‌, అజ్మీర్‌, బికనేర్‌, కోటా లాంటి ఏడు నగరాల్లోని 34 ప్రదేశాల్లో నిర్మిస్తున్న నమూనాలను ఇక్కడ కూడా అములు చేసే విధంగా ఆయన నమూనాలను రూపొందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories