GHMC మేయర్‌ ఎన్నికపై ఉత్కంఠ.. మజ్లిస్‌ పార్టీ స్టాండ్‌ ఎలా ఉండబోతుంది

GHMC మేయర్‌ ఎన్నికపై ఉత్కంఠ..  మజ్లిస్‌ పార్టీ స్టాండ్‌ ఎలా ఉండబోతుంది
x
GHMC
Highlights

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏపార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇప్పుడు అందరీ దృష్టి జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికపైనే. ఏపార్టీ బలమెంత..? ఎవరి మద్దతు ఎవరికి ఉంటుంది..? ఇలాంటి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎంఐఎం స్టాండ్‌ ఎలా ఉండబోతుంది. టీఆర్ఎస్‌కు ప్రత్యక్షంగా ఆపార్టీ మద్దతిస్తుందా..? లేక మీటింగ్‌కు రాకుండా పరోక్షంగా హెల్స్‌ అవుతారా..? మేయర్‌ పీఠం మనదేనని పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్‌ ప్రకటించడం వెనుక ధీమా ఏంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏపార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు సంబంధించి మజ్లిస్‌ పార్టీ కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా గ్రేటర్‌ ఎన్నికల్లో కమలం జోరుసాగినా అది మేయర్‌ పీఠం కైవసం చేసుకునే స్థాయిలో సాగలేదు. కానీ.. అధికార టీఆర్ఎస్‌ పార్టీకి మాత్రం బీజేపీ గట్టి పోటీనిచ్చిందనే చెప్పొచ్చు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 56 స్థానాలతో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా టీఆర్ఎస్‌ అవతరించింది. దీంతో ఆపార్టీ బలం ఎక్స్‌ అఫిషియో సభ్యులతో కలిపి 88కు చేరింది. అటు బీజేపీ 47 స్థానాలు గెలిచి రెండో స్థానంలో నిలిచినా.. ఇద్దరు ఎక్స్‌ అఫిషియో సభ‌్యులు ఉండటంతో ఆపార్టీ బలం 49కి పరితమయింది. ఇటు ఎంఐఎం 44 స్థానాలు కైవసం చేసుకోగా.. ఆపార్టీ కున్న పదిమంది ఎక్స్‌ అఫిషియో సభ‌్యులతో కలిపి 54కి చేరింది. కాంగ్రెస్‌ రెండు స్థానాలు గెలుపొందగా.. ఆపార్టీకున్న ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిసి ఆపార్టీ బలం నాలుగుకు చేరింది.

ఇదిలా ఉంటే.. తెలంగాణ ఏర్పాటు నుంచి టీఆర్ఎస్‌, ఎంఐఎం పార్టీలు మిత్రులుగా ఉంటూ వచ్చాయి. గ్రేటర్‌ ఎన్నికల్లో కమలం పార్టీకి తమ దోస్తి ప్లస్‌ కావొద్దని భావించిన టీఆర్ఎస్‌, ఎంఐఎం ఎవరికివారు ఒంటరిగా బరిలో నిలిచారు. చెప్పాలంటే ఒక సమయంలో ఇరుపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అయితే ఇదంతా వ్యూహాత్మకంగా సాగిందేనని కొట్టిపారేసినవారు లేకపోలేదు. అయితే ప్రస్తుతం మేయర్‌ ఎన్నిక సమయం దగ్గర పడినా తమ పొత్తుపై టీఆర్ఎస్‌, ఎంఐఎం నోరు మొదపడం లేదు.

మరోవైపు బీజేపీకి ఎంఐఎం మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. అలాగే టీఆర్ఎస్‌కు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేందుకు ఆపార్టీ సిద్ధంగా లేదని సమాచారం. అలాగని వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో మేయర్‌, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనే అంశంపై ఎంఐఎం తర్జనభర్జన పడుతోంది. సమావేశం నుంచి వాకౌట్‌ చేయడమా..? మొత్తానికే గైర్హాజర్‌ కావడమా అనే అంశాలపై చర్చించనుంది. దారుస్సలాంలో ఈనెల 11న జరిగే కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశంలోనే పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ అవలంబించే వ్యూహంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories