Secunderabad: డెక్కన్ భవన్ కూల్చేందుకు జీహెచ్‌ఎంసీ రెడీ

GHMC is Ready to Demolish Deccan Building
x

Secunderabad: డెక్కన్ భవన్ కూల్చేందుకు జీహెచ్‌ఎంసీ రెడీ 

Highlights

Secunderabad: భవనాన్ని కూల్చేందుకు టెండర్లను ఆహ్వానించిన అధికారులు

Secunderabad: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో భవనాన్ని కూల్చేందుకు GHMC సిద్ధమైంది. భవనాన్ని కూల్చేందుకు అధికారులు టెండర్లు ఆహ్వానించారు. 1890 చదరపు అడుగుల నిర్మాణాన్ని కూల్చేందుకు 33లక్షల 86వేల 268లతో టెండర్ పిలిచారు. భవనం కూల్చివేతకు అధునాతన యంత్రాలను సమకూర్చుకోవాలని టెండర్‌లో అధికారులు సూచించారు. చుట్టుపక్కల నివాసాలు ఉండడంతో వాటికి ప్రమాదం జరగకుండా ఉండేలా కూల్చివేత చేయాలని నిర్ణయించారు. చుట్టూ తార్ పాలిండ్లు ఏర్పాటు చేసి కూల్చివేయాలని నిర్ణయించారు. ఇద్దరి ఆచూకీ పై స్పష్టత రాగానే కూల్చివేత ప్రారంభించేందుకు అన్ని అంశాలను అధికారులు సిద్ధం చేసుకుంటున్నారు. భవనంలోని అన్ని ఫ్లోర్లను సెల్లార్ తో సహా కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. 20K.M.T.S డిబ్రిస్ ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories