ఒమిక్రాన్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు.. జనవరి 2వ తేదీ వరకూ ఆంక్షలు..

GHMC Guidelines to Prevent Omicron Variant Cases | Omicron Cases in Hyderabad
x

ఒమిక్రాన్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు.. జనవరి 2వ తేదీ వరకూ ఆంక్షలు..

Highlights

GHMC: *పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్న జీహెచ్ఎంసీ *రద్దీ ప్రాంతాల్లో రోజూ వారిగా శానిటేషన్ చేసేందుకు చర్యలు

GHMC: ఒమిక్రాన్ రూపంలో ముంచుకొస్తున్న మూడోవేవ్ విపత్తుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ సమాయత్తమైంది. అసలే నూతన సంవత్సర వేడుకలు ముందుండడం, ఒమిక్రాన్ కేసులు క్రమక్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒమిక్రాన్ భయం పెరుగుతోంది. వైరస్ వ్యా్ప్తిని ఆదిలోనే అరికట్టేందుకు బల్దియా అధికారులు చర్యలు చేపట్టారు.

ఇందుకు తోడుగా ప్రభుత్వం సైతం కొన్ని ఆంక్షలను విధించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా జనవరి 2వ తేదీ వరకు సభలు, సమావేశాలు ర్యాలీలను నిషేధించారు. వీటితో పాటు ఇతరత్రా ఈవెంట్ల నిర్వహణ సమయంలో ఖచ్చింతగా కొవిడ్ నిబంధనలను పాటించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ సహకారంతో పోలీసు శాఖ అన్ని విభాగాలను సమాయత్తం చేసింది.

మరోవైపు శానిటేషన్ విభాగం నగర పరిశుభ్రతకు పెద్దపీట వేసింది. అత్యంత రద్దీ ప్రదేశాలు, ప్రధాన వాణిజ్య కేంద్రాలున్న ప్రాంతాలతో పాటు రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లు, బస్టాండ్లు, ప్రధాన ఆసుపత్రులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద రోజువారిగా పరిశుభ్రత చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రతి రోజు రెండు నుంచి మూడు సార్లు సోడియం హైడ్రోక్లోరైడ్‌తో శానిటేషన్ చేయించబోతున్నారు.

మరోవైపు ప్రభుత్వం ఆదేశించిన మార్గదర్శకాలను అమలు చేసేందుకు ప్రత్యేక జీహెచ్ఎంసీ విజిలెన్స్‌తో పాటు డిఆర్ఎఫ్ బృందాలతో నిఘా ఏర్పాటు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోని వారిపై డిజాస్టార్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. అలాగే న్యూ ఇయర్ వేడుకలపై దృష్టి సారించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories