Hyderabad: ఆస్తిపన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ దృష్టి

GHMC Focus On Property Tax Collection | Telugu News
x

ఆస్తిపన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ దృష్టి 

Highlights

Hyderabad: వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ కింద పన్ను వసూళ్లకు రెడీ

Hyderabad: హైదరాబాద్ లో ఆస్తి పన్ను చెల్లింపు విషయంలో మొండిగా వ్యవహరించే వారి దగ్గర నుంచి ఎలాగైనా పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బకాయిల వసూలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది. అందుకు గతంలో చేసిన పద్ధతినే ఎంచు కోబోతున్నారా మొండి బకాయి దారులకు వన్ టైం సెటిల్ మెంట్ చేసుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయా..

జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు పద్దెనిమిది లక్షల మంది టాక్స్ చెల్లింపుదారులు ఉన్నారు. అందులో 2 నుంచి 3 లక్షల మంది గత కొన్నేళ్లుగా పన్ను చెల్లించడం లేదు. అలాంటి వారి వద్ద వసూలు కావాల్సిన మొత్తం బకాయి వడ్డీతో కలిపితే 1,500కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వడ్డీని గతంలో మాదిరిగా 90శాతం వరకు మాఫీ చేస్తే ఆ డిమాండు 1000కోట్లకు తగ్గనుంది. ఈ 1000 కోట్ల మొత్తాన్ని వసూలు చేస్తే ghmc కి ఆదాయం భారీగా వచ్చే అవకాశం ఉంది. ‎ఇలా అందరి చేత పన్ను కట్టించడం కోసం ఏప్రిల్ నెలలో ఎర్లీ బర్డ్ ఆఫర్ ను పెడతారు. మొండి బకాయిలుగా ఉన్న వారు తమ కోసం ఏమైనా ఆఫర్ పెట్టారేమో అని ఎంక్వైరి చేస్తున్నారని చెబుతున్నారు అధికారులు.

మొండి బకాయిదారుల నుంచి పన్ను వసూలు చేయడానికి గతంలో వన్ టైం సెటిల్ మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. గతంలో మొదటిసారి ఆగస్టు 1, 2020న ప్రభుత్వం ఓటీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టగా దానిలో 550 కోట్ల మేర పన్ను వసూలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 లో మొత్తం 2వేల కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 1635 కోట్లు వసూలైంది. ఇలా ఊహించని విధంగా పన్ను వసూలవడంతో ఈ ఏడాది లక్ష్యాన్ని అధికారులు 2వేల కోట్లుగా పెట్టుకునే అవకాశం ఉంది.

ఇలా రెండు నుంచి మూడు నెలల గడువిచ్చి వన్ సెటిల్మెంట్ స్కీమ్ కింద బకాయిలు వసూలు చేసేందుకు సర్కారు సిద్ధమైంది. అందులో భాగంగానే ఇప్పటికే జీహెచ్ఎంసీ నుంచి పురపాలక శాఖ అధికారులు అన్ని వివరాలు తీసుకున్నారని అంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories