డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికలు?

డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికలు?
x
Highlights

దుబ్బాక వార్ అలా ముగిసిందోలేదో పొలిటికల్ పార్టీల ఫోకస్ జీహెచ్ఎంసీపై పెట్టాయి. అటు ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే వారంలో రానున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరగడంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

దుబ్బాక వార్ అలా ముగిసిందోలేదో పొలిటికల్ పార్టీల ఫోకస్ జీహెచ్ఎంసీపై పెట్టాయి. అటు ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే వారంలో రానున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరగడంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే పొలిటికల్ పార్టీలతో భేటీ అయిన ఈసీ ఎన్నికలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకుని కసరత్తు కూడా మొదలు పెట్టేసింది. దీంతో గ్రేటర్ ఫైట్ కు సర్వం సిద్ధమైనట్లయింది.

జీహెచ్ఎంసీ ఎన్నికలకోసం ఈసీ స్పీడ్ పెంచింది. రాజకీయ పార్టీలతో జరిగిన వరుస భేటీలతో ఎన్నికలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. భేటీ అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాన్నారు. ఒక్కో డిజవిన్‌లో జనాభా సంఖ్యలో చాలా తేడా ఉందని, లోపాలు సరిదిద్దుకుని ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఆదరబాదరగా నిర్వహించడం సరికాదని అభిప్రాయపడ్డారు పీసీసీ నేత నిరంజన్. తాము ఎన్నికలకు భయపడటం లేదని, గతంలో జరిగిన లోటుపాట్లు సరిచేయలని సూచించామని పేర్కొన్నారు.

మరోవైపు ఓటరు జాబితాలో అవకతవకలను ఈసీ దృష్టికి తెచ్చినట్లు బీజేపీ నేతలు వివరించారు. పోలింగ్ బూత్ వారీగా ఓటర్ జాబితా ఇవ్వాలని కోరామని, అధికారులు కార్పొరేటర్లతో కుమ్మక్కై బీజేపీ అనుకూల ఓట్లను తొలగించారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రిసైడింగ్ అధికారులుగా నియమించొద్దన్న నేతలు.. కేంద్ర ప్రభుత్వ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎస్ఈసీ కోరామని తెలిపారు. సెక్యూరిటీ డిపాజిట్, అభ్యర్థి ఖర్చును పెంచాలని ఈసీని కోరారు.

ఇక డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీపావళి మరుసటిరోజే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్యను ఈసీ పరిశీలించింది. ఎన్నికల కోసం సిబ్బందికి శిక్షణను పూర్తి చేసింది. కరోనా నిబంధనలతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేయనుంది. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories