రేపటితో ముగియనున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం

రేపటితో ముగియనున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం
x
Highlights

ఇంకొక్క రోజు అంతే గ్రేటర్ ప్రచారానికి రేపటితో ఆఖరు ! దీంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయ్. వ్యూహప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయ్. ఇక అటు తెలంగాణలో...

ఇంకొక్క రోజు అంతే గ్రేటర్ ప్రచారానికి రేపటితో ఆఖరు ! దీంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయ్. వ్యూహప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయ్. ఇక అటు తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఖండించారు.

లెక్క తీసి కొడితే ఇంకొన్ని గంటలు అంతే ! ఆదివారం సాయంత్రంతో గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. దీంతో రానున్న కొన్ని గంటలు బల్దియా ఎన్నికల్లో కీలకంకానున్నాయ్. ఇక అటు పార్టీలన్నీ దూకుడు పెంచాయ్. ప్రచార బరిలో దూసుకుపోతున్నాయ్. ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. టీఆర్ఎస్, బీజేపీ మధ్య అయితే పీక్స్‌కు చేరింది యుద్ధం! కేసీఆర్ బహిరంగ సభ తర్వాత రాజకీయం మరింత వేడెక్కింది. ఇక అటు ఓటర్లను ఆకట్టుకునేందుకు గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీలన్నీ పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయ్.

గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఆ తర్వాత మళ్లీ జరిగే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు.

మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న బండి సంజయ్ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. ఎవరో ఏదో అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక అటు కరోనా సమయంలో మోడీ సర్కార్ 20లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించిందని అది ఎవరికైనా అందిందా అంటూ ప్రశ్నించారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నట్లు బీజేపీ ఆరోపిస్తోందని అలాగైతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని అన్నారు.

ఇక అటు కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. గల్లీగల్లీ తిరుగుతూ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలుచేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దింపుతోంది. నడ్డాతో పాటు ఫడ్నవీస్, స్మృతి ఇరానీలాంటి కీలక నేతలు హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించగా ఆదివారం అమిత్ షా భాగ్యనగరానికి రానున్నారు. దీంతో ప్రచారం సమరం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories