పోలింగ్ శాతం పెరిగిందోచ్..!ఎవరికి లాభం?

పోలింగ్ శాతం పెరిగిందోచ్..!ఎవరికి లాభం?
x
Highlights

గ్రేటర్‌ ఎన్నికల్లో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. పోలింగ్‌కు సంబంధించిన తుది వివరాలను ఎస్‌ఈసీ ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం 46.6...

గ్రేటర్‌ ఎన్నికల్లో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. పోలింగ్‌కు సంబంధించిన తుది వివరాలను ఎస్‌ఈసీ ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం 46.6 శాతం పోలింగ్ నమోదైనట్టు స్పష్టం చేసింది. 2016 గ్రేటర్ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి 1.31 శాతం పోలింగ్ పెరిగింది. ఓల్డ్ మలక్‌పేట్‌లో గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ రద్దయింది. రేపు ఈ డివిజన్‌లో రీపోలింగ్‌ జరగనుంది. దీంతో పోలింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది.

10 నుంచి 40శాతం లోపు పోలింగ్ న‌మోదైన డివిజ‌న్లు 17 ఉండగా 40 నుంచి 50 శాతంలోపు పోలింగ్ నమోదైన డివిజన్లు 93 ఉన్నాయి. 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైన డివిజన్లు 39 ఉన్నాయి. అత్యధికంగా కంచన్‌బాగ్‌లో 70.39 శాతం, అత్యల్పంగా యూసుఫ్‌గూడలో 32.99 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. ఆర్సీపురంలో 67.71 శాతం, పటాన్‌చెరు - 65.77, భారతినగర్ - 61.89, గాజులరామారం - 58.61, నవాబ్‌సాహెబ్‌కుంట - 55.65, బౌద్ధనగర్ - 54.79, దత్తాత్రేయనగర్ - 54.67, రంగారెడ్డినగర్ - 53.92, జంగంమెట్ - 53.8 శాతం పోలింగ్ నమోదైంది.

డిసెంబర్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే ఓటరు తీర్పును స్ట్రాంగ్‌ రూమ్‌లలో భారీ బందోబస్తు నడుమ భద్రపరిచారు అధికారులు. గతంతో పోలిస్తే ఈ సారి కొంత శాతం ఎక్కువగానే పోలింగ్ నమోదైందని కోవిడ్, వరుస సెలవులు లేకపోతే పోలింగ్ శాతం మరింత పెరిగేదని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories