జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. ప్రశంసల జల్లు కురిపించిన అమిత్ షా, నడ్డా

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. ప్రశంసల జల్లు కురిపించిన అమిత్ షా, నడ్డా
x
Highlights

దుబ్బాక ఉపఎన్నికల ఫలితంతో మంచి ఊపుమీదున్న కమలనాధులకు గ్రేటర్ ఎన్నికల ఫలితాలు మరింత జోష్ నిచ్చాయి. మొత్తం 150 డివిజన్లకు గానూ 48 స్థానాల్లో విజయం...

దుబ్బాక ఉపఎన్నికల ఫలితంతో మంచి ఊపుమీదున్న కమలనాధులకు గ్రేటర్ ఎన్నికల ఫలితాలు మరింత జోష్ నిచ్చాయి. మొత్తం 150 డివిజన్లకు గానూ 48 స్థానాల్లో విజయం సాధించి గ్రేటర్‌లో బీజేపీ సత్తా చాటింది. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగే సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి 48 సీట్లను కైవసం చేసుకుంది. ఈ ఘనత తెలంగాణ బీజేపీ శ్రేణులనే కాదు, ఆ పార్టీ అధినాయకత్వాన్ని సంతోషానికి గురిచేసింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా ఫుంజుకుంది. దుబ్బాక ఎన్నికల ప్రభావం బల్దీయాలోనూ బీజేపీ చాటుకుంది. 2016 ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైన బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లో ఏకంగా 48 స్థానాల్లో కైవసం చేసుకుంది. ఓ వైపు అధికారపార్టీ టీఆర్ఎస్, ఎంఐఎం విమర్శలకు కౌంటర్ ఇస్తూ ప్రజల్లో పట్టునిలుపుకుంది. గ్రేటర్లో మేజిక్ ఫిగర్ సాధించనప్పటికీ రెండో స్థానానికి చేరుకోవడంతో గెలుపుతో సమానంగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీపై విశ్వాసం ఉంచిన హైదరాబాద్ నగర వాసులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. బీజేపీ శ్రేణులు అధ్బుత ప్రదర్శన కనబర్చారని అభినందించారు. పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, లక్ష్మణ్ పలువురు నేతలు పార్టీ కార్యకర్తలతో కలిసి సంబురాలు జరుపుకున్నారు. ఒకరినొకరు స్వీట్లు పంచుకొన్నారు. గ్రేటర్‌ ఫలితాలపై తమకు సంతృప్తినిచ్చాయన్నారు. 2023లోనూ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేస్తామని బండి సంజయ్ చెప్పారు.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు. ప్రజల నమ్మకాన్ని ఎంఐఎం, టీఆర్ఎస్ కోల్పోయాని తెలిపారు. ముందస్తు ఎన్నికలతో తమకు సమయం సరిపోలేదని లేకపోతే మేయర్ పీఠాన్ని దక్కించుకునే వాళ్లమని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా రాష్ర్ట నేతలతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించారంటూ ప్రశంసించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories