కొనసాగుతున్న ఓల్డ్ మలక్‌పేట్ రీపోలింగ్

కొనసాగుతున్న ఓల్డ్ మలక్‌పేట్ రీపోలింగ్
x
Highlights

ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్ ప్రారంభమైంది. పార్టీల గుర్తులు తారుమారు కావడం వల్ల ఈ డివిజన్‌లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఉదయం 7 గంటల...

ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్ ప్రారంభమైంది. పార్టీల గుర్తులు తారుమారు కావడం వల్ల ఈ డివిజన్‌లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ డివిజన్‌లో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. డివిజన్ పరిధిలో 54,655 మంది ఓటర్లు ఉన్నారు. ఓల్డ్ మలక్‌పేట డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా తహసీల్దార్ శైలజను ప్రత్యేకంగా నియమించారు. రీపోలింగ్ కారణంగా ఓల్డ్ మలక్​పేట డివిజన్​లో సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. మరీ ఈ డివిజన్‌లోనైనా చెప్పుకోదగ్గ పోలింగ్‌ జరుగుతుందో చూడాలి.

ఎన్నికల రంగంలోకి బరిలో ఉన్న ఆరుగురు అభ్యర్థుల్లో సీపీఐ అభ్యర్ధి ఫిర్దోస్ ఫాతిమాకు కేటాయించిన ఎన్నికల గుర్తు తారుమారు కావడంతో ఆపార్టీకి చెందిన ఎన్నికల ఏజెంట్ సయ్యద్ మన్నాన్ ఆపార్టీ నాయకుల ద్వారా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన ఎన్నికల కమిషన్ ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో మంగళవారం జరిగిన పోలింగ్ ను రద్దు చేసింది. తిరిగి ఈరోజు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories