Gazette Notification: నేటి నుంచే గెజిట్‌ అమలు

Gazette Notification Implementation from Today 14 10 2021
x

నేటి నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలు (ఫైల్ ఫోటో)

Highlights

*15 అవుట్‌లెట్ల జాబితాను ప్రకటించిన కేఆర్‌ఎంబీ *ఉత్తర్వుల జారీకి ఏపీ ప్రభుత్వం కసరత్తు

Gazette Notification: తెలుగు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్ట్‌లపై కీలకమైన అడుగుకు సమయం ఆసన్నమైంది. కృష్ణా, గోదావరి నదుల బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి అమలు కానుంది. దీంతో 5 ప్రాజెక్ట్‌ల పరిధిలోని 29 అవుట్‌లెట్‌ కేంద్రాలు నేటి నుంచి బోర్డుల ఆధీనంలోకి రానున్నాయి. రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్ అవుట్‌లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకోనున్నట్లు కేఆర్‌ఎంబీ నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రాజెక్ట్ ల అన్ని డైరెక్ట్ అవుట్‌ లెట్లు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. అయితే కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో ప్రాజెక్ట్‌లను టేకప్‌ చేసే ప్రస్తావన లేదని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినా, కేఆర్‌ఎంబీ మాత్రం బోర్డుల పరిధి ఖరారు చేస్తామని వెల్లడించింది.

మొదటి దశలో ఐదు ప్రాజెక్ట్‌ల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి కేఆర్‌ఎంబీ గుర్తించింది. ప్రాజెక్ట్‌లవారీగా సిబ్బంది, కార్యాలయాలు, యంత్రాలు పరికరాలు ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా ముసాయిదా తయారుచేసినట్లు కేఆర్‌ఎంబీ వెల్లడించింది. ముందు నుంచీ జల వివాదాలను పరిష్కరించుకోలేని తెలుగు రాష్ట్రాలు కొన్ని ప్రాజెక్ట్‌లపై అధికారులు కోల్పోనున్నాయి. ఇప్పటికే జారీ అయియిన గెజిట్‌ నోట్‌ ప్రకారం ఇవాల్టీ నుంచి ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్ట్‌లు కేంద్రం ఆధీనంలోకి వెళ్లనున్నాయి.

గెజిట్‌పై ఇప్పటికే రెండు బోర్డులూ తెలుగు రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించాయి. అయితే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల వాదనలను బోర్డులు పట్టించుకోకపోవడంతో మీటింగ్స్ నామమాత్రంగా మమ అన్నట్లు ముగించాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ కు చెందిన విద్యుత్‌ ఉత్పత్తికేంద్రాలను కూడా బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లను కేంద్రానికి అప్పగించేందుకు ఏపీ అంగీకారం తెలిపినా తెలంగాణ మాత్రం నో చెబుతోంది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను బోర్డు తేల్చాలని తెలంగాణ పట్టుబడుతోంది.

కష్ణా నది జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరడం ఎన్జీటీ నుంచి సుప్రీంకోర్టు దాకా ఫిర్యాదులు చేసుకోవడం గోదారి జలాలపైనా గొడవలు పడుతోన్న క్రమంలో పరిష్కారమార్గంగా కేంద్రమే పెత్తనాన్ని స్వీకరిస్తామని చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories