Ganesh Chaturthi 2020: ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకతలివే..

Ganesh Chaturthi 2020: ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకతలివే..
x

Khairatabad Ganesh Laddu

Highlights

Vinayaka Chavithi 2020: వినాయక చవితి అంటే ఊరంతా పండగే. విఘ్నేశ్వరుడు అంటే అందరి దేవుడు.

Vinayaka Chavithi 2020: వినాయక చవితి అంటే ఊరంతా పండగే. విఘ్నేశ్వరుడు అంటే అందరి దేవుడు. ఒకరకంగా ముల్లోకాలకు అధిపతి. విఘ్నాదిపతిగా ఆది పూజలందుకునే వినాయకునికి చేసుకునే వేడుక అలా ఇలా ఉండదు. నిజానికి గణేశుడు అంటేనే ప్రకృతికి ప్రతిరూపం. వినాయకుని పూజల్లో ప్రతి భాగంలోనూ ప్రకృతి తత్వం ఉంటుంది. సకల మానవాళికి అద్భుత మైన సందేశం ఉంటుంది. అయితే, హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణనాధుడి ప్రేత్యేకత వేరు. ఈ గణనాధుడికి ఈ ఏడాది 100 కిలోల లడ్డూ ప్రసాదం సిద్దం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని సురుచి సంస్థ 100 కిలోల లడ్డూను తయారు చేసింది. సురుచి సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిఖార్జునరావు అధ్వర్యంలో ఈ లడ్డును సిద్దం చేసి ఆ లడ్డుపై వినాయకుడి ప్రతిమను తెర్చిదిద్దారు.

అయితే, ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు దేవతల వైద్యుడైన ధన్వంతరి అవతారంలో దర్శనం ఇవ్వనున్నాడు. గత సంవత్సరం భారీ ఎత్తులో వినాయకుడి విగ్రహం పెట్టిన నిర్వాహకులు ఈ సరి కేవలం 9 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంది అని తెలిపారు. అంతే కాదు ఈ విగ్రహంలో ఓ వైపు లక్ష్మీదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలను ఏర్పాటు.. పర్యావరణ హితంగా ఈసారి విగ్రహాన్నిమట్టితో తీర్చిదిద్దారు. వరుసగా 66వ సారి నిర్వహకులు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. అదే విదంగా గత ఏడాదికి భిన్నంగా గణేష్ కమిటీ నిమజ్జన ఏర్పాట్లు కూడా చేస్తునట్లు సమాచారం.

ప్రతి ఏడాది ప్రతిష్టించే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణపతికి ఎంత విశిష్టత మనక తెలిసిందే.. అయితే, ఈ ఏడాది రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కారణంగా పరిస్థితులు ఒక్క సరిగా మారిపోయాయి. ఖైరతాబాద్ కమిటీ నిర్వహకులు చరిత్రలోనే తొలిసారిగా చిన్న గణేష్ ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఖైరతాబాద్ గణేష్ కమిటీ చుస్తే.. మొదట్లో 1970లో ఖైరతాబాద్‌లో 9 అడుగుల వినాయకుడ్ని ప్రతిష్ఠించారు. అయితే మళ్ళి సుమారు 50 ఏళ్ళ తరువాత రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా 9 అడుగుల ఎత్తులో గణపతి విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తున్నామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories