Gandipet Resorvoir : పదేళ్ల తరువాత నిండు కుండలా మారిన గండిపేట జలాశయం

Gandipet Resorvoir : పదేళ్ల తరువాత నిండు కుండలా మారిన గండిపేట జలాశయం
x
Highlights

Gandipet Resorvoir : గత కొద్ది రోజులగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు...

Gandipet Resorvoir : గత కొద్ది రోజులగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని చెరువులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగు నీటి అవసరాలను తీర్చే గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కూడా పూర్తిస్థాయిలో నిండాయి. పదేళ్ల క్రితం పూర్తి నీటి మట్టంతో నిండిన ఈ జలాశయాలు మళ్లీ ఇప్పుడు అదే విధంగా నిండి కనిసిస్తున్నాయి. పదేళ్ల తరువాత నిండుకుండలా మారాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి.

2010లో కురిసిన భారీ వర్షాలకు ఈ జలాశయాలు నిండగా, అప్పట్లో గేట్లను తెరిచారు. ఆ తరువాత మరోసారి గండిపేట గేట్లను ఈ రోజు గేట్లను తెరవనున్నామని నీటి పారుదల శాఖ అధికారులు తెలియజేశారు. గండిపేట జలాశయంలో నీటిమట్టం 1,790 అడుగుల స్థాయికి చేరుకోవడంతో జలాశయం గేట్లను తెరిచి, నీటిని మూసీలోకి వదిలేందుకు అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ సిబ్బంది, అలాగే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మూసీ నది వెళ్లే మార్గమంతా అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం నిల్వ ఉన్న నీటితో మరో రెండేళ్ల పాటు నగర వాసులకు మంచినీటికి కొరత ఉండదని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఎగువ నుంచి మరింత వరద వస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories