Gandhi Hospital: రేపటి నుంచి కోవిడ్ ఆసుపత్రిగా గాంధీ హాస్పిటల్‌

Gandhi Hospital as Covid Hospital From Tomorrow
x

గాంధీ హాస్పిటల్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Gandhi Hospital: గాంధీ హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ సేవలు నిలిపివేత

Gandhi Hospital: తెలంగాణలో కరోనా బుసలు కొడుతోంది. గాంధీ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ సేవలు నిలిపి వేశారు. గాంధీ హాస్పిటల్ ను పూర్తి స్థాయి కోవిడ్ హాస్పిటల్ గా మార్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారి చేసింది. ఓపీ సేవలు నిలిపి వేసి కేవలం కోవిడ్ కేసులకు మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా నిర్ణయించారు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో 450 మందికి పైగా పేషంట్స్ చికిత్స పొందుతున్నారు. ప్రతి పది నిమిషాలకు ఒకరు గాంధీ హాస్పిటల్ లో చేరుతున్నారు. నిన్న ఒక్క రోజే 150 మంది కరోనా పేషంట్లు చేరారు. కోవిడ్ పేషంట్లతో గాంధీ హాస్పిటల్ ఐపీ బ్లాక్ నిండిపోయింది. ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపి వేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

Show Full Article
Print Article
Next Story
More Stories