KTR: భవిష్యత్‌ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే..

Future For Electric Vehicles Says Minister KTR
x

KTR: భవిష్యత్‌ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే..

Highlights

KTR: జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ యూనిట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

KTR: జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ యూనిట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రిక్ పాలసీ నచ్చి పెట్టుబడి పెట్టడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమ స్థాపనకు కావాల్సిన అన్ని అనుమతులను 21 రోజుల్లో ఇస్తున్నామని తెలిపారు. టీఎస్ ఐపాస్ పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ వచ్చిన తర్వాత 23 వేల పరిశ్రమలు నెలకొల్పామన్నారు.

మూడు లక్షల 30 వేల పెట్టుబడులు వచ్చాయని.. 20లక్షల మందికి ఉపాధి అవకశాలు లభించాయని తెలిపారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసీలో, ప్రైవేట్ వెహికల్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ మొబిలిటీ వాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి తెలంగాణ అడ్డాగా మారాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories