IRCTC Maha Kumbh Mela: మహా కుంభమేళాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి IRCTC సూపర్ ప్యాకేజీ..పూర్తి వివరాలివే
IRCTC Maha Kumbh Mela: ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళకు ప్రయాగ్ రాజ్ సిద్ధమవుతోంది. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి...
IRCTC Maha Kumbh Mela: ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళకు ప్రయాగ్ రాజ్ సిద్ధమవుతోంది. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజులపాటు ఈ కుంభమేళా జరగనుంది. కుంభమేళా సందర్భంగా పవిత్రనధుల్లో స్నానం చేసే మోక్షం కలుగుతుందని చాలామంది భక్తులు విశ్వసిస్తుంటారు .
అందుకే కోట్లాది సంఖ్యలో భక్తులు పవిత్ర గంగా, యమునా, సరస్వతి నదుల సంఘమంలో స్నానం చేయడానికి వస్తుంటారు. మరి మీరు కూడా ఈ మహాకుంభమేళాకు వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ శుభవార్త చెబుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా కుంభమేళకు ప్యాకేజీ తీసుకువచ్చింది. మరి ఈ యాత్ర ఎప్పుడు మొదలవుతుంది. ధర ఎంత. ఏ ఏ ప్రదేశాలు చూడొచ్చు. ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఐ ఆర్ సి టి సి టూరిజం మహా కుంభమేళా పుణ్యక్షేత్రం యాత్ర పేరుతో ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీ మొత్తం 7 రాత్రులు 8 పగలు ఉంటుంది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి షురూ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, కాజీపేట ,వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, తునీ, దువ్వాడ, విజయనగరం స్టేషన్లలో యాత్రికులు ఈ ట్రైన్ ఎక్కవచ్చు. టూర్ ముగిసిన తర్వాత తిరిగి ఆయా స్టేషన్లలోనే దిగవచ్చు. మహాకుంభమేళా తో పాటు వారణాసి, అయోధ్య కూడా దర్శించుకునే అవకాశం ఉంటుంది.
మొదటిరోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ప్రారంభమవుతుంది. కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రిలో ఈ రైలు ఎక్కవచ్చు.
రెండో రోజు తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా ప్రయాణించి 3వ రోజు మధ్యాహ్నానికి వారణాసి చేరుకుంటారు.
అక్కడి నుంచి హోటల్ కి వెళ్లి అక్కడ ప్రాసెస్ పూర్తి చేస్తారు. సాయంత్రం వారణాసిలో గంగాహారతి వీక్షించి ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.
నాలుగో రోజు బ్రేక్ఫాస్ట్ అనంతరం ప్రయాగ్ రాజ్ బయల్దేరుతారు. అక్కడ హోటల్లో చెకింగ్ పూర్తయిన తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత కుంభమేళకు వెళ్తారు. ఆ రోజంతా అక్కడే ఉండి ఆ రాత్రికి ప్రయాగ్ రాజ్ లోనే టెంట్ సిటీలో స్టే చేయాల్సి ఉంటుంది.
ఐదో రోజు అల్పాహారం తరువాత వారణాసికి బయలుదేరుతారు. అక్కడ హోటల్లో చెకింగ్ పూర్తయిన తర్వాత కాశీ విశ్వనాథ్ అన్నపూర్ణాదేవి ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రికి అక్కడే డిన్నర్ చేసి బస చేస్తారు.
అక్కడి నుంచి అయోధ్యకు బయలుదేరుతారు. అక్కడ శ్రీరామ జన్మభూమి హనుమాన్ ఆలయాలను దర్శించుకున్న తర్వాత రాత్రికి అయోధ్య నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
ఏడవ రోజు కూడా మొత్తం ప్రయాణం ఉంటుంది.
8వ రోజు విజయనగరం, తూనీ, రాజమండ్రి, దువ్వాడ, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట మీదుగా సికింద్రాబాద్ చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది.
ఎకనామి క్లాసులో పెద్దలకు 22,635 రూపాయలు ఉంటుంది. 5 నుంచి 11 ఏండ్ల చిన్నారులకు రూ.21,740గా ధర నిర్ణయించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire