TGPSC : నేటి నుంచి గ్రూప్ -3 పరీక్షలు- అభ్యర్థులు ఈ జాగ్రత్తలు తప్పనిసరి పాటించండి

TGPSC Group 1 Mains Exam
x

రెండో రోజు గ్రూప్-1 పరీక్ష.. నిమిషం ఆలస్యం అయినా... అనుమతించేదిలేదన్న అధికారులు 

Highlights

TGPSC : రాష్ట్రంలో గ్రూప్ 3 పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే పరీక్షలకు సర్వం సిద్దం చేసినట్లు టీజీపీఎస్సీ...

TGPSC : రాష్ట్రంలో గ్రూప్ 3 పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే పరీక్షలకు సర్వం సిద్దం చేసినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఉదయం పరీక్ష 10గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30గంటలకు పరీక్ష పూర్తవుతుంది.

అభ్యర్ధులను ఉదయం 9.30 తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. మధ్యాహ్నం పరీక్ష 3గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.30గంటలకు ముగుస్తుంది. అభ్యర్థులను 2.30గంటల తర్వాత పరీక్ష సెంటర్ లోకి అనుమతించమని టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు.

అభ్యర్థులు తమ వెంట బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, ఒరిజినల్ ఐడీ కార్డు తెచ్చుకోవాలని కమిషన్ సూచించింది. హాల్ టికెట్ పై తాజా పాస్ పోర్టు ఫొటోను అంటించుకుని తీసుకురావాలని పాస్ పోర్టు ఫొటో 3 నెలల కంటే పాతది ఉండకూదని తెలిపింది.

టీజీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ కాపీని అభ్యర్థులు జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపింది. తొలిరోజు పరీక్షకు తీసుకువచ్చిన హాల్ టికెట్ ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని తెలిపింది. ఫలితాలు వచ్చి రిక్రూట్ మెంట్ పూర్తయ్యే వరకు ప్రశ్నపత్రాలు, హాల్ టికెట్లను భద్రంగా పెట్టుకోవాలంటూ కమిషన్ సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories