మహిళల కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

మహిళల కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం
x
కర్రసాము
Highlights

మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న దాడులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ సామర్థ్యాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా మహిళలకు...

మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న దాడులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ సామర్థ్యాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా మహిళలకు కర్రసాము, కత్తిసాము లాంటి విద్యలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నేర్పిస్తున్నారు. దీని ద్వారా మహిళలు ఆపద సమయాల్లో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా తమను తాము రక్షించుకునేందుకు వీలుంటుందని నిపుణులు భావిస్తున్నారు.

మహిళల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు పలు విద్యలను నేర్పిస్తోంది తెలంగాణ సాంస్కృతిక శాఖ. మహిళ భద్రతతోపాటు అంతరించిపోతున్న గ్రామీణ కళారూపాలను కాపాడేందుకు కర్రసాము, కత్తిసాము లాంటి విద్యల్లో శిక్షణ ఇస్తోంది. హైదరాబాద్ రవీంద్రభారతిలో 45రోజులపాటు మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్రసాములో పీహెచ్‌డీ పట్టా పొందిన డాక్టర్ ఆకుల శ్రీధర్ వీరికి శిక్షణ ఇవ్వనున్నారు.

బాలికలు, మహిళల రక్షణ కోసం గ్రామీణ సంప్రదాయ స్వీయ రక్షణ, యుద్ధ కళారూపమైన కత్తిసాముపై ఈ శిక్షణను ఉచితంగా అందిస్తున్నట్టు కోచ్ ఆకుల శ్రీధర్ తెలిపారు. తాను గత పదేళ్లుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా ఆత్మరక్షణతోపాటు చాలా ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఆయన సూచించారు.

మరోవైపు రవీంద్రభారతిలో తొలిగా వంద మందికి శిక్షణ ఇస్తామని, ఆ తర్వాత కాలేజీలు, స్కూళ్లలో ప్రతి గ్రామీణ స్థాయిలో కూడా నేర్పిస్తామని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అధికారులు తెలిపారు. అలాగే, మహిళల భద్రత కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు.

అయితే, కర్రసాము తమకు ఎంతో ఆత్మస్థైర్యాన్నిచ్చిందని శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు తెలిపారు. కర్రసాము వల్ల దేహదారుడ్యం బాగుంటుందని, ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ధృడమైన మనస్సును కలిగి ఉంటారని అంటున్నారు. తాము ఏడాది నుంచి కర్రసాములో శిక్షణ పొందుతున్నామని, ఇది స్వీయ రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories