Hyderabad: రోజు రోజుకు పెరుగుతున్న క్రిప్టో కరెన్సీ,ట్రేడింగ్ మోసాలు

Fraudulent Advertisements About Investing in Cryptocurrency | TS News Today
x

రోజు రోజుకు పెరుగుతున్న క్రిప్టో కరెన్సీ,ట్రేడింగ్ మోసాలు

Highlights

Hyderabad: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాలంటూ మోసపు ప్రకటనలు

Hyderabad: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పందాల్లో మోసాలకు తెరలేపుతున్నారు. ఎట్రాక్ట్ అయ్యే ప్రకటనలు ఇస్తూ లక్షలు కోట్లు కొల్లగొడుతున్నారు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. క్రిప్టో ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి నట్టేట్ట ముంచుతున్నారు. ఇటీవలే ఈ తరహా మోసాలు అధికంగా వెలుగు చూస్తున్నాయి హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో నగరానికి చెందిన ఓ వ్యక్తి 70 లక్షల రూపాయలను పొగొట్టుకున్న ఘటన మర్చిపోకముందే మరో కేసు వెలుగు చూసింది. ఓ వ్యక్తి దగ్గర 3లక్షలు తీసుకున్న కేటుగాళ్లు ఆ తర్వాత సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ పెట్టడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు.

ఇలాంటి సైబర్ నేరాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆకర్షిత ప్రకటనలకు లోనుకాకుండా జాగ్రత్త పడాలని చెప్తున్నారు. పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎలాంటి లాభాలు రావని..పైగా అనవసర లింక్స్‌ను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories