తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఫాక్స్‌కాన్ కంపెనీ

Foxconn Company Done Agreement With Telangana Govt
x

తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఫాక్స్‌కాన్ కంపెనీ

Highlights

* ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఫాక్స్‌కాన్ ఛైర్మన్‌ యంగ్ లియు భేటీ

KCR: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఫాక్స్ కాన్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను 'హోన్ హై ఫాక్స్ కాన్' ఛైర్మన్ యంగ్ లియూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఫాక్స్ కాన్ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. దీంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి లభ్యం కానుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఫాక్స్ కాన్ ముఖ్యమైనది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories