Amnesia Pub Case: ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు

Four Suspects Arrested in Amnesia Pub Case | Hyderabad News
x

Amnesia Pub Case: ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు

Highlights

Amnesia Pub Case: ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు నిందితులు అరెస్ట్

Amnesia Pub Case: జూబ్లీహిల్స్‌ బాలిక అత్యాచార కేసు రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బాధిత బాలికతోపాటు మరో బాలికను నిందితులు వేధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కార్పొరేటర్ కుమారుడే కీలక సూత్రధారిగా పోలీసులు చెబుతున్నారు. నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌తో కలిసి పబ్‌లో అరాచకాలు సృష్టించినట్లు తెలిపారు. సాదుద్దీన్‌ మాలిక్‌, కార్పొరేటర్‌ కొడుకు కలిసి ఇద్దరు మైనర్లను వేధించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. నిందితుల వేధింపులు భరించలేక పబ్ నుంచి బయటకు బాలికలు వచ్చారని పోలీసులు తెలిపారు.

''పబ్ నుంచి బయటకు వచ్చి నేరుగా క్యాబ్ తీసుకొని బాలిక వెళ్లిపోయింది. బాలికల వెనకాలే సాదుద్దీన్ అండ్ గ్యాంగ్ బయటకు వచ్చింది. పబ్ ముందే నిలబడ్డ బాధిత బాలికను కార్పొరేటర్ కొడుకు ట్రాప్ చేశాడు. ఇంటి వద్ద దించుతామని గ్యాంగ్ నమ్మించింది. మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమేర్‌ఖాన్‌కు చెందిన బెంజ్‌ కారులో అమ్మాయితో కలిసి నలుగురు ప్రయాణించారు. పబ్ నుంచి నేరుగా కాన్సూ బేకరి వరకు గ్యాంగ్ వెళ్లింది. బెంజ్‌ కారులోనే అమ్మాయి పట్ల గ్యాంగ్ అసభ్యకరంగా ప్రవర్తించింది. అరాచకాలు భరించలేక కాన్సూ బేకరి నుంచి బాధిత బాలిక వెళ్లిపోతానని చెప్పింది. బాలికను మళ్లీ బెంజ్‌ కారులో ఎక్కించుకొని కొద్దిదూరం ప్రయాణించారు.

ఫోన్‌ కాల్‌తో మధ్యలో దిగి ఎమ్మెల్యే కుమారుడు వెళ్లిపోయాడు. బెంజ్‌ కారులో పెట్రోల్ అయ్యిపోయిందంటూ గ్యాంగ్ డ్రామాలు ఆడింది. వెనుకాలే మరో ఇన్నోవాలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు వచ్చాడు. ఆ తర్వాత బాలికను గ్యాంగ్ ఇన్నోవాలోకి తరలించింది. బంజారాహిల్స్‌లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై గ్యాంగ్ అత్యాచారానికి పాల్పడింది. అత్యాచారం తర్వాత నిందితులు బేకరికి వచ్చారు. ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫోటో దిగి ఇన్‌స్టాలో పోస్టు చేశారు. బేకరి నుంచి నిందితులు ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.

కేసు నమోదుకాగానే హైదరాబాద్ నుంచి నిందితులు పారిపోయారు. ఇన్నోవా కారును వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఫాంహౌస్‌లో నిందితులు దాచారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరికోసం గాలింపు ముమ్మరం చేశారు. నిందితులు వినియోగించిన కార్లలో ఫోరెన్సిక్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై కూపీ లాగుతున్నారు. నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి. బాధితురాలు స్టేట్‌మెంట్ ను రెండో సారి నమోదు చేశారు. బాధితురాలు, తల్లిదండ్రుల స్టేట్‌మెంట్ సైతం న్యాయమూర్తి ముందు రికార్డు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం నిందితులను వారం రోజులు పాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టు ను కోరారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories