Drugs Case: బెంగళూరులో తీగ లాగితే.. తెలంగాణలో కదిలిన డొంక!

Four MLA Members in Drugs Bangaluru Case
x

Representational Image

Highlights

Drugs Case: మత్తు మందుల కేసులో నలుగురు ఎమ్మెల్యేలు * ఎమ్మెల్యేలు డ్రగ్స్‌ పార్టీలకు హాజరైనట్టు గుర్తింపు

Drugs Case: స్థిరాస్తి వ్యాపారం రాజకీయం సినిమా వారితో పరిచయాలు లావాదేవీల్లో మిత్రులైన పక్క రాష్ట్రాల వారితో పార్టీలు వాటిలో డ్రగ్స్‌ వినియోగం... వెరసి అదో ప్రపంచం. తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ మత్తు రొంపిలో ఇరుక్కున్నారు. బెంగళూరులో పోలీసులకు చిక్కిన డ్రగ్స్‌ సరఫరా ముఠా వద్ద తీగ లాగితే తెలంగాణలో డొంక కదిలింది. కర్ణాటకతోపాటు తెలంగాణలోనూ సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు డ్రగ్స్‌ కేసు విచారణ వేగవంతమైంది.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పలుమార్లు డ్రగ్స్‌ పార్టీలకు హాజరైనట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. సరైన సాక్ష్యాధారాలు సేకరించిన తరువాత విచారణకు హాజరు కావాలంటూ వారికి నోటీసులు పంపిస్తామన్నారు. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు తెలుగుసినీ పరిశ్రమకు చెందినవారు కొందరు ఈ కేసులో ఉన్నా వారి పేర్లన్నీ పోలీసు రికార్డులకే పరిమితమయ్యాయి. దాంతో వారెవన్నది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. బెంగళూరు పోలీసులు కూడా ఎవరి పేర్లను బయట పెట్టడంలేదు. కానీ ఒక్కసారి నోటీసులు జారీ అయినా, విచారణకు హాజరైనా వారు ఎవరన్నది త్వరలో వెలుగుచూసే అవకాశం ఉంది. ఇప్పటికే రతన్‌రెడ్డి, కలహార్‌రెడ్డి అనే ఇద్దరు హైదరాబాద్‌ పారిశ్రామికవేత్తలకు నోటీసులు జారీ చేసి ఈనెల 5న విచారణకు హాజరుకావాలని సూచించారు. ఈ కేసులో మొదట కన్నడ సినీ నిర్మాత శంకరగౌడను అరెస్టు చేయడంతో హైదరాబాద్‌తో సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. కలహార్‌రెడ్డి హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల పార్టీ ఏర్పాటు చేస్తే, బెంగళూరు నుంచి శంకరగౌడ మత్తు పదార్థాలు సరఫరా చేసేవాడని పోలీసులు తెలిపారు.

బెంగళూరు పార్టీలకు విదేశీ యువతులను రప్పించినట్లు పోలీసులు పోలీసులు గుర్తించారు. వారు ఎవరనే కోణంతోపాటు హైదరాబాద్‌లో జరిగిన పార్టీలకు కూడా వీరు వచ్చారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇక ఇప్పటికే అరెస్టయిన నైజీరియన్ల వద్ద సీజ్‌ చేసిన ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ల విశ్లేషణల ద్వారా అనుమానిత ఎమ్మెల్యేలతో వారు టచ్‌లో ఉన్నారనేది రూఢీ అయింది. అయితే వారు డ్రగ్స్‌ తీసుకున్నారా? లేదా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories