Etela Rajender: అరుపులకు, కేసులకు భయపడేటంత చిన్నవాడిని కాదు: మాజీ మంత్రి ఈటల

Etala Comments On Cm KCR
x

ఈటల ఫైల్ ఫోటో 

Highlights

Etela Rajender: రాజ్యం మీ చేతుల్లో ఉంది.. అధికారులు మీరు చెప్పిందే రాస్తున్నారు. ఈటల వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతుంది.

Etela Rajender: ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. ఆ త‌ర్వాత నుంచి ఈటల వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతుంది. టీఆర్ఎస్ తో పాటు రాజకీయ వర్గాల్లోనే ఈటల ఎపిసోడ్ పై ప్రధాన చర్చ జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌..పథకం ప్రకారం తనపై కుట్ర పన్నారని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమని ప్ర‌క‌టించారు. ఇలాంటి చర్యలు కేసీఆర్ గౌరవాన్ని పెంచవు అంటూ ఈటల వ్యాఖ్యానించారు. భూములు కొలవాలంటే 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలని ఆయ‌న అన్నారు. ఉద్యమానికి ముందే తనకు పౌల్ట్రీ వ్యాపారం ఉందని గుర్తు చేశారు.

ఈట‌ల మాట్లాడుతూ.. అధికారులు రూపొందించిన రిపోర్ట్ తప్పులతడకగా ఉందన్నారు. కలెక్టర్‌ నివేదిక అందలేదని.. తన ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి అరెస్ట్‌పై ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు నిజాయితీ, నిష్పక్షపాతం ఉంటే అసైన్డ్ భూముల ఘటనలు ఎన్ని జరగలేదు? మీ వ్యవసాయ క్షేత్రానికి రోడ్లు అసైన్డ్ భూముల నుంచి వేయలేదా?'' అంటూ సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్‌ ప్రశ్నలు సంధించారు.

ఎన్నికల ఫలితాల్లో ప్రజాగ్రహం ఏ విధంగా ఉంటుందో చూశాం. అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు. మీ అరుపులకు, కేసులకు భయపడేటంత చిన్నవాడిని కాదు. సాంబశివుడు చనిపోయిన నేను వెళ్తే నయీం ముఠా కూడా నన్ను భయపెట్టింది.. కానీ నేను భయపడలేదు. నయీం లాంటి హంతక ముఠా చంపుతానంటే నేను భయపడలేదని'' ఈట‌ల వ్యాక్యానించారు.

రాజ్యం మీ చేతుల్లో ఉంది.. అధికారులు మీరు చెప్పిందే రాస్తున్నారు. భూముల సర్వేపై మాకు నోటీసులు ఇచ్చారా?. భయానక వాతావరణం సృష్టించి భూ సర్వే చేశారు. రాజ్యానికి ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. నాపై కేసులు పెట్టే అధికారం కూడా మీకు ఉంది. చట్టాన్ని గౌరవించాలి కానీ అతిక్రమించడం కరెక్ట్ కాద అని ఈటల అన్నారు.

మరోవైపు అసైన్డ్ భూములను ఈటల కబ్జా చేసినట్టు కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. జమున హ్యాచరీస్ ఆధ్వర్యంలో కబ్జా చేసిన భూములు ఉన్నట్టు కలెక్టర్ నివేదిక ఇచ్చారు. హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూకబ్జా జరిగినట్టు అధికారులు తేల్చారు.

రెవెన్యూ అధికారుల విచారణలో భూ కబ్జా జరిగిందని తేలడంతో ఈటలపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977తో పాటు అటవీ సంరక్షణ 1980 ప్రకారం ఆయనపై కేసులు నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే భూ కబ్జా వివాదంపై జరిగిన విచారణకు సంబంధించిన నివేదికను మెదక్ జిల్లా కలెక్టర్, సీఎస్ కు అందజేశారు. అయితే, ఈ నివేదికలో ఏం ఉందనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు, విజిలెన్స్ నివేదికను కూడా ఇవాళ ప్రభుత్వానికి అందించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories