వెలుగులోకి మరో భారీ భూ కుంభకోణం.. ఆర్డీఓ సస్పెండ్..

వెలుగులోకి మరో భారీ భూ కుంభకోణం.. ఆర్డీఓ సస్పెండ్..
x
Highlights

రాష్ట్రంలో వరుసగా భూ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి.. తాజాగా సంగారెడ్డి జిల్లాలో మరో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.. సంగారెడ్డి జిల్లాలో జరిగిన భూమీ అక్రమ కేటాయింపు..

రాష్ట్రంలో వరుసగా భూ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి.. తాజాగా సంగారెడ్డి జిల్లాలో మరో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.. సంగారెడ్డి జిల్లాలో జరిగిన భూమీ అక్రమ కేటాయింపు వ్యవహారంలో గతంలో తహశీల్దార్ గా పనిచేసిన ప్రస్తుత కామారెడ్డి ఆర్డీవో నగేష్ ను సీఎస్ సోమేశ్ కుమార్ సస్పెండ్ చేశారు. జిన్నారం మండలం ఖాజీపల్లిలో 2019లో చేసిన భూదందాపై ఎంక్వైరీ ఆధారంగా సస్పెన్షన్ వేటువేశారు. కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని నలుగురికి కట్టబెట్టడంపై సీఎస్ సోమేశ్‌కుమార్ చర్యలు తీసుకున్నారు. జిన్నారం మండలం ఖాజీపల్లిలో 80 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని 2013లో నలుగురు మాజీ సైనికులకు కట్టబెట్టారు తహశీల్ధార్ నరేందర్..

అయితే ఈ భూమి 2013 లో అప్లై చేసుకుంటే 2007 లొనే ఇచ్చినట్లు రికార్డుల ట్యాపరింగ్ కు పాల్పడ్డారాయన. అయితే కొద్దీ నెలల క్రితం సదరు భూమికి ఎన్.ఓ.సి జారీ చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు వచ్చింది. ఈ ఫైల్ పరిశీలిస్తున్న సందర్భం లో ఇరవై ఎకరాల భూమి కేటాయింపు వ్యవహారంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రికార్డులు శోధించగా అసలు గుట్టు రట్టయింది.. ఆ భూమి కేటాయింపు తర్వాత ఎవరికి ఎంత ఇవ్వాలి అనే దానికి సంబంధించి తహసీల్దార్ నరేందర్ రాసిన స్లిప్ ఒకటి దొరికింది.. దీనిపై విచారణ చేసి మొత్తం వ్యవహారాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ కు నివేదిక సమర్పించారు జిల్లా కలెక్టర్. దాంతో ఆర్డీవో నరేందర్ తోపాటు అప్పటి డిప్యూటీ తహసిల్దార్ నారాయణ, అలాగే మరో ఆరుగురు అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ సస్పెండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories