Kalvakuntla Kavitha: కవితపై ప్రత్యేక ఆర్టికల్‌ను ప్రచురించిన ఫోర్బ్స్ ఇండియా మేగజైన్
Kalvakuntla Kavitha: బతుకమ్మతో ప్రత్యేక రాష్ట్ర కాంక్షను బలంగా చాటిన కవిత
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి కూతురుగానో.. రాజకీయ వారసురాలిగానో.. కాకుండా తనకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రజాప్రతినిధిగా.. తెలంగాణ బిడ్డగా తనదైన ముద్రవేస్తూ ముందుకు సాగుతున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి పేరుతో సంస్థను స్థాపించి రాష్ట్ర సాధనలో తనవంతు పాత్రను పోషించారామె. బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తూ తెలంగాణ సంప్రదాయాన్ని దశదిశలా చాటారు కవిత. ఆమె ప్రస్తానాన్ని ప్రశంసిస్తూ పోర్భ్స్ ఇండియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
బతుకమ్మ అంటే కవిత.. కవిత అంటే బతుకమ్మ అనేంతలా తెలంగాణ సంప్రదాయ వేడుకను ప్రపంచానికి పరిచయం చేశారు కవిత. వాడవాడలా వెళ్లి తెలంగాణ ఆడపడచులతో కలిసి బతుకమ్మను ఆడారు. ఉద్యమ సమయంలో బతుకమ్మతోనూ ప్రత్యేక రాష్ట్ర కాంక్షను బలంగా చాటడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణ జాగృతి పేరుతో సంస్థను స్థాపించి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను ప్రతిబింబింపజేశారు కవిత. ఎంపీగానూ పార్లమెంట్లో తనదైన ముద్రవేశారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ బలమైన గొంతుకగా మారారు. కేవలం ముఖ్యమంత్రి కూతురుగానో.. రాజకీయ వారసురాలిగానో కాకుండా కవిత. నాయకత్వ పటిమ.. వాగ్ధాటి, విషయ పరిజ్ఞానంతో పాటు తెలంగాణ ప్రాంతంపై లోతైన అవగాహనతో ముందుకెళ్తున్నారు. ఇవన్నీ తెలుగు ప్రజలకు తెలిసిన విషయాలే. అయితే.. కవిత ప్రస్తానాన్ని ప్రశంసిస్తూ ఫోర్బ్స్ ఇండియా మేగజైన్ ప్రత్యేక ఆర్టికల్ ప్రచురించడం బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా సేవలందిస్తున్న కవిత.. తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా.. నాయకత్వ పటిమను ప్రదర్శిస్తున్నారని... సమాజంలో మార్పులు తీసుకురావడంలో తనవంతు కృషిచేస్తున్నారని ఫోర్బ్స్ ప్రశంసించింది.
కరీంనగర్లో జన్మించిన కల్వంకుంట్ల కవిత హైదరాబాద్‌లోని స్టాన్లీ గర్స్ హైస్కూల్ లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి యూనివర్శిటీ ఆఫ్ సదరన్ మిస్సిసిపి కంప్యూటర్ సైన్స్‌లో పీజీ చేశారు. యూఎస్ లోనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశారు. ఆ తర్వాత 2004లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఏకం చేయడానికి తెలంగాణ జాగృతి పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉద్యమానికి ఊపిరిలూదారు. ఇది కవిత కెరీర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఓ మలుపని ఫోర్బ్స్ ఇండియా ఆర్టికల్ లో ప్రశంసించింది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కవిత రాష్ట్ర సాధనకు కేసీఆర్ కు అండగా నిలిచారని ఫోర్బ్స్ ఇండియా కితాబిచ్చింది.
తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కవిత 2014 ఎన్నికల్లోనూ సత్తా చాటారు. నిజామాబాద్ ఎంపీగా విజయఢంకా మోగించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం కవిత తండ్రికి అండగా నిలిచారు. ఉద్యమ సమయంలో పోరాడిన కవిత.. రాష్ట్రావిర్భావంతో ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఎంపీగా తెలంగాణ ప్రజల గొంతుకను పార్లమెంట్ లో వినింపించారు. తన జీవన విధానాన్ని పొలిటికల్ లైఫ్ స్టైల్ గా మలచుకున్న కవిత అందుకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఫోర్బ్స్ ఇండియా మేగజైన కితాబిచ్చింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగానూ కవిత రికార్డు స్థాయిలో విజయం సాధించారు. పోలైన ఓట్లలో 89 శాతం ఓట్లతో గెలుపొందారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా తెలంగాణ సమాజంలోని సమస్యలపై గళమెత్తుతున్నారు కవిత. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారతకు పాటుపడుతున్నారు. ఇందుకోసం వేలాది వాలింటీర్లతో సేవలందిస్తున్నారు. తన దృష్టికి ఏదైనా సమస్య వస్తే వెంటనే చొరవ చూపి పరిష్కరిస్తున్నారు కవిత. పేదల చదువులకు అండగా నిలుస్తున్నారని ఫోర్బ్స్ ఇండియా మేగజైన్ కొనియాడింది.
నిజామాబాద్ MPగా ఉన్న సమయంలో ఎస్టిమేట్స్ కమిటీ, కామర్స్ స్టాండింగ్ కమిటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల్లోని కమిటీల్లో సభ్యురాలిగా సేవలందిచారు. కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్ కమిటీలో భారత్ నుంచి కవిత నామినేట్ అయ్యారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపొందించేందుకు కృషిచేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం TRVKS, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ గౌరవ అధ్యక్షురాలిగాను కవిత పనిచేశారు. ప్రజా జీవితంలో తెలంగాణ వాదంతో పాటు ప్రజాసమస్యలపై కవిత గళమెత్తారని పోర్భ్ ఇండియా కీర్తించింది. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్ వంటి అనేక అంతర్జాతీయ వేదికల్లోనూ దేశ, రాష్ట్రాభివృద్ధి కోసం కవిత కృషిచేశారు. అలాగే తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం పోరాడారని ఫోర్బ్స్ ఇండియా మేగజైన్ కొనియాడింది.
రాష్ట్ర సాధన ఉద్యమంలో మహిళలకు సరైన వేదిక లేదని భావించిన కవిత తెలంగాణ జాగృతిని స్థాపించారు. తెలంగాణ సంస్కృతిని పునరుజ్జీవింప చేయడంలో సక్సెస్ అయ్యారామె. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ వేడుకలను ఆటపాటలతో మేల్కొలిపారు. కేవలం తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాల్లోనూ బతుకమ్మ పండుగకు విస్తృత ప్రాచుర్యం కల్పించారు. కవిత కృషివల్ల ఆస్ట్రేలియా, యూకే, ఖతర్, అమెరికా, ఒమన్, అరబ్ ఎమిరేట్స్ తో పాటు తెలంగాణ ప్రజలు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇటీవల దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలోనూ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ జాగృతి సంస్థ విద్య, వైద్యం, మహిళలకు నైపుణ్య శిక్షణతో పాటు వివిధ మార్గాల్లోనూ ప్రజలకు సేవలందిస్తోంది. ఇండియా, అమెరికా, యూకే, ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, ఒమన్ సహా ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి కార్యాలయాలు సేవలందిస్తున్నాయి. వాటిద్వారా తెలంగాణ యువతకు ఉపాధి కల్పన కోసం కవిత చేస్తున్న కృషిని ఫోర్బ్స్ ఇండియా మేగజైన్ తన కథనంలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. SPOT
తెలంగాణ వ్యాప్తంగా 8,500 మంది యువతకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ అందిస్తూ కెరీర్ కు బాటలు వేస్తోంది. ఆమె చేస్తున్న కృషికి చూపిస్తున్న ఆదరాభిమానాలకు కవితక్క అని ప్రేమగా పిలుచుకుంటూ ఆప్యాయతను చాటుకుంటున్నారని ఫోర్బ్స్ ఇండియా మేగజైన ప్రస్తావించింది. పలు కార్మిక సంఘాల్లోనూ సేవలందిస్తున్న కవిత.. వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ విభాగానికి తొలి చీఫ్ కమిషనర్ గా కవిత ఎంపికయ్యారు. ఈ పదవిని చేపట్టిన వారిలో కవిత అత్యంత పిన్న వయస్కురాలు కావడం విశేషం. స్కౌట్స్ అండ్ గైడ్స్ పదవి చేపట్టిన వారిలో దేశంలోనే కవిత రెండో మహిళగా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందిచాలనే కవిత సంకల్పానికి మద్దతుగా అన్ని ప్రైవేటు పాఠశాల్లోనూ స్కౌట్స్ అండ్ గైడ్స్ ను కంపల్సరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఫోర్బ్స్ ఇండియా మేగజైన తన ఆర్టికల్‌లో ప్రస్తావించింది. కవిత మంచి పాఠకురాలే కాకుండా రచయిత్రిగానూ తనదైన ముద్ర వేస్తున్నారు. పబ్లిక్ పాలసీ, పల్లిక్ హెల్త్, యూత్, కల్చర్, టెక్నాలజీ, జాతీయ భద్రత తదితర అంశాలపై జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో సంపాదకీయాలు రాస్తూ తనదైన శైలిలో సమాజంలో మార్పునకు కృషి చేస్తున్నారంటూ కవితను ప్రశంసించింది ఫోర్బ్స్ ఇండియా మేగజైన్.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire