TDP: టీడీపీ చరిత్రలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు దూరం..!

For The First Time In The History Of TDP Is Not Participate In Assembly Elections
x

TDP: టీడీపీ చరిత్రలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు దూరం..!

Highlights

TDP: చంద్రబాబు నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేస్తున్న తమ్ముళ్లు

TDP: తెలంగాణ తమ్ముళ్లకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారు. ఐతే ఇప్పటికే కొన్ని అసెంబ్లీ స్థానాలకు అభ‌్యర్థులను కూడా ఎంపిక చేసిన సమయంలో..ఈ అనుహ్య నిర్ణ‍యం టీటీడీపీ కేడర్‌ను తీవ్ర నిరాశలో ముంచేసింది. ఎన్నికల్లో సత్తా చాటాలని కలలు కన్న తమ్ముళ్ల ఆశకు గండిపడినట్టైంది. అసలు ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి..? కేడర్ లేకనా..? బలమైన అభ్యర్థులు దొరకకనా..? లేక చంద్రబాబు జైల్లో ఉండడమే ఇందుకు రీజనా..? కారణం ఏదైనా TDP చరిత్రలో తొలిసారి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో పోటీకి దూరమవుతోంది సైకిల్. తెలంగాణలో ఇక సైకిల్ పని ఖతమైనా..? తెలంగాణలో ఆశలను..టీడీపీ పూర్తిగా వదలుకున్నట్టేనా..?

పార్టీ అర్భావించిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ నాయకత్వంలో 1984లో అధికారం చేపట్టింది టీడీపీ. నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొని పార్టీ నిలబడింది. బలహీనవర్గాల పార్టీగా తెలుగు రాష్ట్రాల్లో అసంఖ్యాకమైన ప్రజాధరణను పొందింది. ఏపీ విభజన తర్వాత కూడా తెలంగాణ సెంటిమెంట్ టైంలోనూ.. 15సీట్లు గెలుచుకుని సత్తా చాటింది సైకిల్ పార్టీ. 2018లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని.. 2సీట్లు సంపాదించగలింది. ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది.

ముఖ్యంగా హైదరాబాద్ శివారు నియోజకవర్గాలతో పాటు ఖమ్మం, నిజామాబాద్‌లో టీడీపీకి మంచి పట్టు ఉంది. బలమైన లీడర్లు లేరు కానీ,, కేడర్ మాత్రం బలంగానే ఉంది. ఐనా పోటీకి చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేశారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ చరిత్రలో తెలంగాణలో తొలిసారి టీడీపీ పోటీకి దూరమవుతోంది. ఎవరికి లాభం చేకూర్చడానికి రేసు నుంచి సైకిల్ తప్పుకుంది. ఓట్లు చీల్చకూడదనే చంద్రబాబు ఈ నిర్ణ‍యం తీసుకున్నారా అనేది ఆసక్తిగా మారింది.

టీడీపీని జాతీయ పార్టీగా చెప్పుకునే చంద్రబాబు.. తెలంగాణలో పోటీ చేయడం తమ్ముళ్లను విస్మయానికి గురి చేస్తుంది. తెలంగాణలో పార్టీ పూర్వవైభవనానికి కృషి చేస్తానని ఎన్నో సార్లు ప్రకటించిన బాబు.. ఎందుకు సెడెన్‌గా సైలెంట్ అయ్యారు. ఈ దెబ్బతో తెలంగాణలో.. సై...కిల్ అయినట్టేనా..?

Show Full Article
Print Article
Next Story
More Stories