CM KCR: మైనారిటీలకూ రూ. లక్ష ఆర్థిక సహాయం.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

For Minorities Rs Lakh Financial Assistance Govt Issued Orders
x

CM KCR: మైనారిటీలకూ రూ. లక్ష ఆర్థిక సహాయం.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Highlights

CM KCR: కుల మతాలకు అతీతంగా పేదరికం పారదోలడమే లక్ష్యమన్న కేసీఆర్

CM KCR: తెలంగాణలోని మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది.

కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని చెప్పారు.

మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సిఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. విద్య ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతున్నదన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్పలితాలను అందిస్తున్నదని సిఎం అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories